YS Viveka: ఆ పెద్ద అరెస్టుకి ఒక్క అడుగు దూరం..! వివేకా హత్య కేసులో ఇదే కీలకం..!?

Share

YS Viveka: రాష్ట్రంలోనే దేశం మొత్తంగా ఒకే ఒక హత్య కేసు అనేక రకాలుగా ఆసక్తిని, రాజకీయంగా ఇంట్రెస్ట్‌ను కల్గిస్తోంది. ఆ హత్య ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? అనేది దేశం మొత్తం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు తెలియాలి. కడప జిల్లాలో ఇంటింటికి, గడప గడపకు ఈ హత్య ఎందుకు జరిగిందో తెలియాలి. ఆ హత్యే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసు. 2019 మార్చి 15న ఈ హత్య జరిగింది. నేటికి రెండున్నర సంవత్సరాలు దాటింది. ఇప్పటికి కూడా ఎవరు చేశారు. ఎందుకు చేశారు అనేదానిపై ఒక స్పష్టత లేదు. దాదాపు 8 నెలల పాటు ఏపి పోలీస్ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు చేసినా ఏమీ తేల్చలేకపోయారు. దాదాపు 1350 మందిని వారు విచారించారు. అనేక వత్తిళ్ల మధ్య వాళ్లు కేసు దర్యాప్తును వదిలివేశారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. సీబీఐ దర్యాప్తు చివరి దశకు వచ్చే సరికి కడప రాజకీయం ప్రవేశించి సీబీఐ పై ఒత్తిళ్లు నెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు సీబీఐ ఒక్క అడుగు దూరంలో ఉంది. క్లైమాక్స్ ఇవ్వడానికి, ఒక్క పెద్ద తలకాయను అరెస్టు చేయడానికి ఒకే ఒక్క అడుగుదూరంలో ఉండిపోయింది. దానికి కోర్టు ఒప్పుకుంటే వారం లేదా పది రోజుల్లో కేసు ముగిసిపోతుంది. కోర్టు దానికి ఒకే చెప్పితే.

YS Viveka murder case cbi plea for narco test

YS Viveka: నార్కో పరీక్షలతో నిజాలు బయటకు

విషయం ఏమిటంటే… వివేకా హత్య కేసుకు సంబంధించి దేవిరెడ్డి శివశంకరరెడ్డి అనే వ్యక్తి సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను అరెస్టు చేసి దాదాపు నెల రోజులు అవుతోంది. ఈ హత్య కేసులో అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో ఎర్ర గంగిరెడ్డి, శివశంకరరెడ్డి పేర్లు ప్రధానంగా ఉంది. వీళ్ల వెనక ఎవరు ఉన్నారు అనేది దస్తగిరికి తెలుసు. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ లో వాళ్ల పేర్లు కూడా ఉన్నాయి. ఎర్ర గంగిరెడ్డి సగమే చెబుతున్నారు. పూర్తిగా చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో శివశంకరరెడ్డికి నార్కో పరీక్షలు చేస్తే నిజాలు బయటకు వస్తాయి అనేది సీబీఐ ఆలోచన. సీబీఐ దగ్గర ఉన్న ఒకే ఒక్క మార్గం ఇది. నార్కో పరీక్షలు చేయాలంటే కోర్టు అనుమతి ఇవ్వాలి. అందుకే కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. శివశంకరరెడ్డికి నార్కో పరీక్షలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకరరెడ్డి పేరు ప్రధానంగా ఉంది కాబట్టి శివశంకరరెడ్డి వెనుక ఎవరు ఉన్నారో, ఎవరు చెబితే చేయించాడు అనే నిజాలు బయటకు రాబట్టేందుకు నార్కో పరీక్షలు చేయించాలని సీబీఐ కోర్టుకు చెప్పింది. దీనికి కోర్టు అంగీకరిస్తే, శివశంకరరెడ్డికి నార్కో పరీక్షలు జరిగితే నిజాలు వచ్చేస్తాయి. నార్కో పరీక్షలను అఫిషియల్ గా రికార్డు చేసి కోర్టుకు సమర్పిస్తారు. శివశంకరరెడ్డికి నార్కో పరీక్షలు చేయిస్తే ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అయినట్లే. అయితే నార్కో పరీక్షలకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

శివశంకరరెడ్డి అరెస్టుతో బయటకు వచ్చిన ఎంపి అవినాష్ రెడ్డి

ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి అరెస్టు అయినప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించలేదు. దస్తగిరిని అదుపులోకి తీసుకున్నప్పుడు, సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసినప్పుడు కూడా అవినాష్ రెడ్డి రెస్పాండ్ అవ్వలేదు. కానీ శివశంకరరెడ్డి అరెస్టు ఎప్పుడు జరిగిందో వెంటనే ఆయన అక్కడకు వెళ్లి కొంత గందరగోళం సృష్టించి హంగామా చేశారు. అది మీడియాలోనూ వచ్చింది. అవినాష్ రెడ్డి మీద ఒక ఒత్తిడి నెలకొంది. ఇదే క్రమంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డిలు వివేకా హత్య చేయించారు. వాళ్ల పాత్ర ఉంది అంటూ ఈ మధ్య గంగాధరరెడ్డి, ఉదయ్ కుమార్ యాదవ్ లు ఈ మధ్య బయటకు వచ్చి ఆరోపించారు. ఇవి కూడా ఒక సారి సీబీఐ చూడాల్సి ఉంది. సీబీఐ అటు శివశంకరరెడ్డికి నార్కో పరీక్షలు చేయించాలి. మరో పక్క కొత్తగా వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని విచారణ చేయాల్సి ఉంది. సీబీఐ ముందు ఇప్పుడు రెండు టాస్క్ లు ఉన్నాయి. అటు శివశంకరరెడ్డికి నార్కో పరీక్షలు చేయిస్తే నిజాలు బయటకు వస్తాయి. కేసు క్లోజ్ అయినట్లే. సునీత కుటుంబంపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ కోర్టు నార్కో పరీక్షలకు అంగీకరించకపోతే సీబీఐ మొదటి నుండి మొత్తం తవ్వుకుంటూ రావాలి. ఈ కేసు దర్యాప్తు మరో ఏడాది కాలం పాటు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

1 hour ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago