NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీ ఆరవ జాబితా వచ్చేందోచ్ .. కొన్ని సవరణలు ఇలా

YSRCP: వైసీపీ ఇన్ చార్జిలకు సంబంధించి ఆరవ జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన జాబితాలోని ఇన్ చార్జిలను హైకమాండ్ మార్పులు, చేర్పులు చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో పది నియోజకవర్గాలకు మార్పులు జరిగాయి.

నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జిలను పార్టీ ప్రకటించింది. మొత్తం ఆరు లిస్ట్ లు కలిపి 82 స్థానాలకు సంబంధించి ఇన్ చార్జిలను పార్టీ మార్చింది. తాజా జాబితాను ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామష్ణారెడ్డితో కలిసి మంత్రి మేరుగ నాగార్జున విడుదల చేశారు.

పార్లమెంట్ ఇన్ చార్జిలు

  • రాజమండ్రి – గూడూరి శ్రీనివాస్
  • నర్సాపురం – అడ్వకేట్ గూడూరి ఉమాబాల
  • గుంటూరు – ఉమ్మారెడ్డి వెంకట రమణ
  • చిత్తూరు – ఎన్ రెడ్డప్ప

అసెంబ్లీ ఇన్ చార్జిలు

  • మైలవరం – తిరుపతిరావు యాదవ్
  • మార్కాపురం – అన్నా రాంబాబు
  • గిద్దలూరు – నాగార్జున రెడ్డి
  • జీడీ నెల్లూరు – నారాయణ స్వామి
  • నెల్లూరు సిటీ – ఎండీ ఖలీల్
  • ఎమ్మిగనూరు – బుట్టా రేణుక

ఇంతకు ముందు జాబితాలో చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను జీడీ నెల్లూరు అసెంబ్లీకి, ఇక్కడ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ ఇన్ చార్జిగా ప్రకటించారు. నారాయణ స్వామి ఎంపీగా పోటీ చేయడానికి సంసిగ్ధత వ్యక్తం చేయకపోవడం, ఆ నియోజకవర్గంలో నారాయణస్వామినే కొనసాగించాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఎక్కడి వారిని అక్కడికే మళ్లీ రివర్స్ చేశారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంతకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తప్పింది వెంకటేష్ ను ఇన్ చార్జిగా నియమించారు. అక్కడ మళ్లీ ఆయనను తప్పించి మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఇన్ చార్జిగా నియమించారు.

YSRCP: విజయవాడ టీడీపీకి మరో షాక్ .. వైసీపీలో చేరిన మరో సీనియర్ నేత .. ఎంపీ కేశినేని ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లే(గా)..?

 

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Aha OTT: అమ్మకానికి వచ్చిన ప్రముఖ ఓటీటీ సమస్త ఆహా.. కారణం ఇదే..!

Saranya Koduri