ఢిల్లీలో ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం ఆవిష్కరణ

ఢిల్లీ, జనవరి 8: ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్ని రాజకీయ పార్టీలకు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. రఫేల్ స్కాం కంటే అమరావతి స్కాం అతిపెద్దది అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి పాలనపై ఇద్దరు చీఫ్ సెక్రటరీలు బహిరంగంగా విమర్శలు చేశారని ఆయన అన్నారు.
ఢిల్లీలో మంగళవారం జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ ఎంపి వి ప్రభాకరరెడ్డి, మాజీ ఎంపీలు పాల్గొన్నారు.