YSRCP: ఏపిలో ఈ నెల 26వ తేదీ నుండి వరుసగా నాలుగు రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో బస్సు యాత్ర చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మంత్రులు నిర్ణయించారు. 17 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేపట్టే ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్, సభల ఏర్పాటుపై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ తో సమావేశమై చర్చించారు. ఈ బస్సు యాత్ర, బహిరంగ సభల ప్రతిపాదనకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నదో ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తూ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈ నెల 26వ తేదీ శ్రీకాకుళం లేదా విజయనగరంలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. తరువాత 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలను నిర్వహించనున్నారు.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…