వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా

అమరావతి, జనవరి 1 : ఈ నెల మూడవ తేదీన అగ్రిగోల్డు బాధితులకు బాసటగా రాష్ర్టంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలను చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
అగ్రిగోల్డు బాధితులకు సత్వరం న్యాయం చేయాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీని ఏర్పాటు చేశారు. భాధితులకు అండగా వైసీపీ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబరులో రిలే నిరాహార దీక్షలను చేపట్టారు.
ఈనెల మూడున చేపట్టిన ధర్నా కార్యక్రమంలో అగ్రిగోల్డు బాధితులు, ఏజెంట్లు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కోరింది.