అగ్రిగోల్డ్ పై  వైసీపీ ధర్నా

అమరావతి, జనవరి 3 : అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం రాష్ర్టంలోని 13 జిల్లాల కలెక్టరేట్  కార్యాలయాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ ధర్నాలను నిర్వహించింది.  ఈ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటుగా అగ్రిగోల్డు బాధితులు అధికసంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

రాష్ర్ట వ్యాప్తంగా 19లక్షల 70వేల మంది అగ్రిగోల్డు బాధితులు విలవిలలాడిపోతున్నారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. అగ్రిగోల్డు ఆస్తులు, అప్పులు, బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని కోరారు.  ఆత్మహత్యలకు పాల్పడిన అగ్రిగోల్డు బాధితులకు ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

నిరసనల అనంతరం పార్టీ నేతలు జిల్లా కలెక్టర్లకు బాధితులకు సత్వరం న్యాయం చేయాలంటూ వినతిపత్రాలను సమర్పించారు.