NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Nagarjuna Sagar : సాగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ..! ఎన్నికల వ్యూహమా.. లేక..!?

YSRCP: YS Jagan Risk with Central Sharing..

Nagarjuna Sagar : నాగార్జునసాగర్ Nagarjuna Sagar ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లూ తిరుగులేని టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నికల భారీ ఝలక్ ఇచ్చింది. లక్ష ఓట్ల మెజారిటీని పక్కన పెడితే కనీసం సానుభూతి కూడా వర్కౌట్ కాకపోవడం అధికార పార్టీకి షాక్ ఇచ్చేదే. అక్కడ గెలిచిన బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటి గులాబీ దళానికి చెక్ పెట్టింది. 2019 ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా బీజేపీ అభ్యర్ధి అరవింద్ చేతిలోనే ఓడిపోయారు. ఇన్ని అనుభవాలతో నాగార్జునసాగర్ లో ఆచితూచి అడుగులేస్తోంది టీఆర్ఎస్. అయితే.. ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒక అభ్యర్ధి నామినేషన్ వేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

ysrcp in nagarjuna sagar by election
ysrcp in nagarjuna sagar by election

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే వైసీపీ పార్టీని స్థాపించారు జగన్. అయితే.. రెండు రాష్ట్రాలయ్యాక జగన్ పూర్తి ఫోకస్ ఏపీలోనే పెట్టారు కానీ.. తెలంగాణ వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటినుంచి తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా వైసీపీ పోటీకి దిగలేదు. అయితే.. అనూహ్యంగా ఇప్పడు సాగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. పార్టీలను పక్కనపెడితే 12 మంది ఇండిపెంట్లతోపాటు వైసీపీ నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్టు రిటర్నింగ్ అధికారి చెప్పారు. దీంతో తెలంగాణలో వైసీపీ పోటీ ఏంటనే చర్చ మొదలైంది. స్థానికంగా ఉండే వైసీపీ అభిమాని వేసిన నామినేషనా లేక ఏపీ నుంచే అమలైన ఆదేశాలా? అని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

వైసీపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ కే సపోర్టు ఉంటుంది. కానీ.. ఈసారి నామినేషన్ పడింది. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్య గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో వైసీపీ పోటీ చేస్తే ఓట్లు చీలి అవి టీఆర్ఎస్ కే లాభం జరుగుతుంది కాబట్టి.. ఇదొక వ్యూహం అనేవాళ్లూ లేకపోలేదు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డిని ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్ నుంచి ఇంకా అభ్యర్ధులు ఖరారు కాలేదు. నోముల నర్సింహులు కుమారుడు భగత్ కే సీటిద్దామని టీఆర్ఎస్ భావించినా దుబ్బాకలో తగిలిన షాక్ తో వెనకడుగు వేసిందని తెలుస్తోంది. మరి ఈ ఎన్నికల్లో విజయమెవరిదో చూడాల్సిందే..!

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju