NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆదర్శంగా నిలవాల్సిన అధికార నేతలే కరోనా వ్యాప్తి కారకులు..! ఏపీ దుస్థితి ఇది

కరోనా వస్తుంది…. దానంతట అదే వెళ్లి పోతుంది. ఇక భవిష్యత్తులో రాష్ట్రంలో కరోనా బారిన పడని వాళ్ళు ఎవరూ ఉండరు అంటూ ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలను వైసీపీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. సామాజిక దూరం అనే మాటనే మరిచి వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ నిబంధనలు పాటించకుండా సభలు-సమావేశాలు శుభకార్యాలు తమ ఇళ్ళలో జరుపుకుంటున్నారు. ఇలా జరుగుతున్న కార్యక్రమాల్లో కరోనా కేసులు భారీగా బయటపడుతున్నాయి.

 

YSR Congress Party: YSRCP decides to hold 'Betrayal Day' on April ...

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తన ఇంట్లో శుభకార్యం నిర్వహించారు. శుభకార్యాలకు ఇప్పుడు తహసీల్దార్ల అనుమతి తీసుకోవాలి. ఇక వారు కూడా శుభకార్యల్లో పాల్గొనేందుకు కేవలం 20 మంది వరకే అనుమతిని ఇవ్వగలరు. అయితే నందిగం సురేష్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి రెండు వేల మంది హాజరయ్యారు. ఒక్క నిబంధనా పట్టించుకోలేదు. సగం మందికి పైగా అతిథులకు మాస్కులు లేవు. ఇంకేముంది…. పెళ్లికి హాజరైన పలువురికి లక్షణాలు బయట పడ్డాయి. ప్రస్తుతానికి 20మందికి పాజిటివ్ అని తేలింది…. ఇంకా చాలామంది రిపోర్టర్లు రావాల్సి ఉంది. ఈ పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

ఈ రేంజ్ లో బయటపడ్డది కేబలం నందిగం సురేష్ ఒక్కడి వ్యవహారమే. చాలా చోట్ల వైసిపి చోటా.. మోటా లీడర్లు కూడా పట్టించుకోవడం లేదు. అనంతపురం జిల్లా రాయదుర్గం లో గౌని ఉపేందర్ రెడ్డి అనే వైసీపీ నేత కి నాలుగు రోజుల క్రితం పాజిటివ్ అని తేలింది. రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ విషయం అధికారులకు కలెక్టర్ కు ఫిర్యాదు చేయవలసి వచ్చింది. బయటపడ్డ వచ్చిన సరే వైసీపీ నేతలు సూపర్ స్ప్రెడర్ లు గా మారుతున్నారు కానీ ఆదర్శవంతంగా నిలిచేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. 

ఈ ప్రభుత్వం మాదే కాబట్టి ఏ నినంధనలు మేము పాటించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారో ఏమో కానీ వైసిపి నేతల ఆలోచన సరళి మాత్రం చాలా దారుణంగా ఉంటోంది. అనేకచోట్ల ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం గుంపులుగుంపులుగా నిలబడడం…. పుట్టినరోజులు వేడుకలు లాంటి వాటిని జాగ్రత్తలు తీసుకోకుండా జరిపించడం చూస్తుంటే వీరంతా కలిసి ఏపీని మరింత ప్రమాదకర పరిస్థితికి నెట్టేలా ఉన్నారు…. లేదా ఇప్పటికే నెట్టేశారు అంటారా?

author avatar
arun kanna

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!