29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జీఐఎస్ సక్సెస్ తో వైసీపీ విజయోత్సవ సంబరాలకు ప్లాన్ .. ఎలా అంటే ..?

Share

దార్శనిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో రీసెంట్ గా విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) విజయవంతం అయ్యింది. సిఎం జగన్ నేతృత్వంలో ఏపి అద్భుతమైన అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సాంఘీక సంక్షేమంపై దృష్టి సారించి, దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిద్దారు సీఎం జగన్. సీఎం దార్శనికతకు జీఐఎస్ నిదర్శనంగా నిలుస్తొంది.  రాష్ట్రాభివృద్ధి అవకాశాలేంటో ప్రపంచానికి చాటి చెప్పినట్లు అయ్యింది.

Global Investors Summit 2023 Vizag

 

విశాఖలో జరిగిన సమ్మిట్ లో  మొత్తం 352 అవగాహన ఒప్పందాలు జరగ్గా, రూ. 13లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు, 20 రంగాల్లో దాదాపు ఆరు లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతోంది. ఒక్క ఎనర్జీ రంగంలోనే లక్షా 90వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రూ.8.8 లక్షల కోట్ల పెట్టుబడులతో 40 అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఐటీ అండ్ ఐటీఇఎస్ రంగంలో లక్షా నాలుగు వేల 442 మందికి ఉపాధి కల్పించే రూ.25,587 కోట్ల పెట్టుబడులతో 56 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇక పర్యాటక రంగంలో రూ.22,096 కోట్ల పెట్టుబడులతో 117 ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30,787 మందికి ఉపాధి లభించనున్నది.

 

ఈ సమ్మిట్ పలు దేశాల నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారులు, వ్యాపార దిగ్గజాలు, పెట్టుబడిదారులకు రాష్ట్రం లో ఉన్న ఉత్పత్తి సామర్థ్యాలు, పెట్టుబడి అవకాశాలను ఒకేచోట వివరించే అవకాశం కల్పించడం జరిగింది.  రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని గుర్తించిన పెట్టుబడిదారులంతా రావడంతో సమ్మిట్ సక్సెస్ అయ్యింది. సుస్థిర ఆర్థికాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధికి దేశంలోనే ముఖ్య కేంద్రంగా మారే దిశగా పయనిస్తోంది.

 

జీఐఎస్ సక్సెస్ అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో విజయోత్సవ సంబరాలు నిర్వహణకు ఆ పార్టీ ప్లాన్ చేస్తొంది. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో నేతలు, పార్టీ శ్రేణులు .. కేక్ కట్ చేసి, పేదలకు మిఠాయిలు పంపిణీ, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకోవడానికి సిద్దం అవుతోంది. ఇదే క్రమంలో మీడియా సమావేశాలు నిర్వహించడం, జీఐఎస్ విజయాలు వివరించడం లాంటివి చేయనున్నారు. పార్టీ కార్యాలయాల్లో, వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి సంబరాలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతోంది. ఈ కార్యక్రమాల్లో పార్టీ క్యాడర్, ప్రజలు ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని భావిస్తున్నారు.

సీబీఐ నోటీసుపై వైఎస్ అవినాష్ రెడ్డి స్పందన ఇది


Share

Related posts

టిడిపికి మాజీ ఎంఎల్‌ఏ రాజీనామా

sarath

టీటీడీ ఇఓ ధర్మారెడ్డి ఇంట విషాదం … చికిత్స పొందుతూ కుమారుడు మృతి

somaraju sharma

నాయనా చంద్రబాబూ .. నలభై ఏళ్ల అనుభవం అని ఇంకొక్కసారి చెప్పుకోకు ! 

sekhar