NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: సాయి రెడ్డి ఔట్ సజ్జల ఇన్ – జగన్ విశ్వరూపం చూపించాడు గురూ..!

YS Jagan: BJP Two Ways Good News to YSRCP

YSRCP: రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. పలు సందర్భాల్లో పరిశీలకులకు ఊహలకు అందని నిర్ణయాలు జరుగుతుంటాయి. ట్విస్ట్ లు ఉంటాయి. ప్రస్తుతం వైసీపీలో ఎవరూ ఊహించని పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇది గాసిప్ కూడా అయి ఉండవచ్చు. త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుండి రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి, టీడీపీ నుండి ఎన్నికై బీజేపీలో విలీనం అయిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, కేంద్ర మంత్రి సురేష్ ప్రభుల పదవీ కాలం ఈ ఏడాది జూన్ తో ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలు ఏపి అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం కారణంగా వైసీపీకే దక్కనున్నాయి.

YSRCP rajya sabha politics
YSRCP rajya sabha politics

YSRCP: విజయసాయిరెడ్డికి మళ్లీ రాజ్యసభ రెన్యువల్..?

ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎవరిని పంపుతారు అనేది, ఆ పదవులు ఎవరికి వరించనున్నాయి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ వీటిపై అనేక వదంతులు వినబడుతున్నాయి. విజయసాయిరెడ్డికి మళ్లీ రాజ్యసభ ను రెన్యువల్ చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారుట. అయితే విజయసాయి రెడ్డి మరో పక్క ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జి గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నందున రాబోయే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారుట. ప్రజా బలంతో ఎన్నికై ఉత్తరాంధ్రలో తన సత్తా ఏమిటో చూపాలని భావిస్తున్నారనేది టాక్. అయితే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడుగా ఉండటం వల్ల ఢిల్లీలో పార్టీ తరపున చక్రం తిప్పుతున్నారు.

 

ఒక వేళ విజయసాయిరెడ్డి రాజ్యసభకు మరో సారి వెళ్లకుండా ఉత్తరాంధ్ర క్రియాశీల రాజకీయాలకే పరిమితం కావాలని భావిస్తే ఢిల్లీలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి సరైన నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి యేనని సీఎం జగన్ యోచిస్తున్నారని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సజ్జల ప్రభుత్వ సలహాదారుగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక భూమికను పోషిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ లు ఇవ్వడంతో పాటు అనేక ప్రభుత్వ వ్యవహారాలను చూస్తున్నారు. అయితే ప్రతి అంశంలోనూ సజ్జల జోక్యంపై ప్రతిపక్షాలు ఆయనను సకల శాఖల మంత్రి అంటూ వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమర్శలకు చెక్ పెట్టాలంటే సజ్జలను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని సీఎం జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!