న్యూస్

YSRCP: వైసీపీలో మరో ఘాటు అసమ్మతి..! తిరుగుబాటు వెంటనే పొగడ్తలు..! ఎవరా ఎమ్మెల్యే..?

Share

YSRCP: ఏపి మంత్రివర్గ విస్తరణలో చోటు లభించకపోవడంతో పలువురు సీనియర్ వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వారి అనుచరులు అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజా మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా కొంత మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి అనుచరులు ఆందోళన కూడా చేశారు. అయితే ఈ నేతలు మాత్రం అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఉమ్మడి విశాఖ జిల్లా పాయికారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై మాత్రం అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన అనుచరులు ఆందోళన చేశారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, మేకతోటి సుచరిత, కొలుసు పార్దసారధి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితర నేతలు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అనంతరం మెత్తబడ్డారు. తమకు ఎటువంటి అసంతృప్తి లేదని ప్రకటించారు. అయితే గొల్ల బాబూరావు మాత్రం కాస్త ఆలస్యంగా మెత్తబడ్డారు.

దెబ్బకు దెబ్బ అంటూ ఘాటు వ్యాఖ్యలు

మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో తొలుత గొల్ల బాబూరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్టానం దెబ్బకొట్టింది..నేను దెబ్బకొడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను అందరూ సౌమ్యుడు, అమాయకుడు, అహింసా వాది అని అనుకుంటారు..కానీ వాస్తవానికి తాను హింసావాదిని, అవకాశం వచ్చినట్లు తానేంటో చూపిస్తా, దెబ్బకు దెబ్బ కొట్టి చూపిస్తాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొల్ల బాబూరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టిపిక్ గా మారాయి. మరో సారి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు గొల్ల బాబూరావు. తాను అమాయకుడిని కాదు, నూటికి నూరు శాతం హింసా వాదినే, లక్ష మందితో మీటింగ్ పెట్టి చెప్పమన్నా చెప్తానన్నారు. జైల్లో పెట్టినా భయపడేది లేదనీ, సింహంలా ఉంటా, సింహంలానే బతుకుతానని అన్నారు.  సోషల్ మీడియాలో బాబూరావు మాటల వీడియో వైరల్ అయ్యాయి. దీనిపై అధిష్టానం స్పందించి ఆయనతో మాట్లాడిందో లేక ఆయనే మనసు మార్చుకున్నారో కానీ నేడు యూటర్న్ తీసుకున్నారు. తాను అధిష్టానానికి వీరవిధేయుడని చెప్పుకొచ్చారు.

YSRCP: మంత్రి పదవి రానందుకు బాధ లేదు

కాగా తనకు మంత్రి పదవి రానందుకు బాధలేదని పేర్కొన్న బాబూరావు..అధిష్టానానికి ఎల్లప్పుడూ విధేయుడనని చెప్పారు. తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే నియోజకవర్గంలో ఇప్పటి వరకూ మంత్రి పదవి ఇవ్వనందుకు ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు బాబూరావు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం, ఇబ్బందిని ఎదుర్కొవడానికే ఆ పదం వాడాను తప్ప అందులో వేరే ఉద్దేశం లేదన్నారు. హింసావాదం అంటే ప్రజలు, కేడర్ కు జరుగుతున్న అన్యాయంపై ముందుండి పోరాటం చేయడమేనని అన్నారు. తమకు టికెట్ రాకుండా చాలా మంది ప్రయత్నించినా సీఎం వైఎస్ జగన్ అదరించారనీ, ఆనాడు వైఎస్ఆర్ ఎలా ఆదరించారో ఆ తరువాత జగన్ కూడా ఆదరించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని అన్నారు. వైసీపీ అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు బాబూరావు.

YSRCP: గొల్ల బాబూరావు రాజకీయ ప్రస్థానం

గ్రూప్ 1 ఆఫీసర్ గా 1986లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన గొల్ల బాబూరావు కడప, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేశారు. ఆ తరువాత పంచాయతీరాజ్ అడిషనర్ కమిషనర్ పని చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు అమలాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2015 లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మరల పాయకరావుపేట నియోజకవర్గం నుండి తిరిగి పోటీ చేసి మూడవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


Share

Related posts

Raghurama Krishnam Raju: ఏపీలో స్కూల్ రీఓపెనింగ్ అంశంపై రఘురామకృష్ణంరాజు సంచలన కామెంట్స్..!!

sekhar

Intinti Gruhalakshmi: లాస్యను నందు వదిలేస్తాడా..!? గాయత్రి ఫైర్ కి అంకిత రియాక్షన్.. ప్రేమ్ ఆ నిర్ణయంకి తలోగ్గాడా..! 

bharani jella

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ లిస్ట్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar