NewsOrbit
న్యూస్

YSRCP : ఏదో జరుగుతుంది.. ఏం జరుగుతోంది? జగన్ కుర్చీ కు ఎసరు పెడుతున్నది నిజమేనా??

YSRCP : ఏదో జరుగుతుంది.. ఏం జరుగుతోంది? జగన్ కుర్చీ కు ఎసరు పెడుతున్నది నిజమేనా??

YSRCP : ఇటీవల జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీ లో వైఎస్ఆర్ సీపీ YSRCP లో అంతర్గత కలహాలు ఉన్నాయంటూ వచ్చిన కథనం ఎంతో సంచలనం సృష్టించింది. ఈ కథనం వచ్చిన తర్వాత వైయస్సార్సీపి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రిపబ్లిక్ టీవీ లో వచ్చిన కథనానికి ఎలాంటి విశ్వసనీయత లేదని, పార్టీలో అంతా బాగున్నప్పుడు కావాలని టిడిపి కు అనుకూలంగా ఇలాంటి కథనాలు వేస్తున్నారు

అంటూ మండిపడటమే కాకుండా, సదరు ఛానల్ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాను అంటూ చెప్పుకొచ్చారు. అంత వరకు బాగానే ఉన్నా… దాని తర్వాత కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వైయస్సార్సీపి లో ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కు వెనకాల ఏదో జరుగుతుంది అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

something is there in ap politics YSRCP
something is there in ap politics YSRCP

ఈ నేతల మాటలు పట్టించుకోవచ్చా??

రిపబ్లిక్ టీవీ కథనం మీద సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్మీట్ అనంతరం నరసాపురం ఎంపీ వైఎస్ఆర్సిపి రెబెల్ నేత రఘురామకృష్ణంరాజు యధావిధిగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆ కథనాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, జగన్కు ఆంతరంగికుడు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉందని చెప్పడం కొంత అయోమయానికి దారితీసింది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక లైన్లో వెళ్తున్నా ఎంపీ రఘురామకృష్ణంరాజు మాటలను చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోలేదు.

ఆయనతో కావాలనే టిడిపి శక్తులు మాట్లాడుతున్నా అన్న రీతిలో కొట్టిపడేశారు. అయితే బుధవారం పోలింగ్ రోజున నగిరి ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ రోజా సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రిపబ్లిక్ టీవీ కథనాలకు ఊతమిస్తోంది. ఆమె కూడా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపిలో కొందరు నేతలు జగన్ కు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని, ముఖ్యమంత్రి జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పడం చూస్తే పార్టీలో ఏదో జరగడంతో పాటు, ముఖ్యమంత్రి జగన్ మీద కొందరు గురి పెట్టారు అని అర్థమవుతోంది.

టార్గెట్ పెద్దిరెడ్డి!

రిపబ్లిక్ టీవీ కథనాల తర్వాత మొత్తం ఒక సొంత వైయస్ఆర్సిపి సీనియర్ నాయకుడు పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి మీద చాలా మంది కేంద్రీకరించారు. ముఖ్యంగా టిడిపి, జనసేన సోషల్ మీడియా విభాగాలు రకరకాల మీమ్స్ లో పెద్దిరెడ్డి వాళ్లనే జగన్ కుర్చీ కు ప్రమాదం అనే రీతిలో కొన్ని పోస్టులు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. గతంలోనూ ఓ తెలుగు ఛానల్ లో పెద్దిరెడ్డి కొందరు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని, ప్రభుత్వాన్ని కూలదోయడానికి చూస్తున్నారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ కథనం తర్వాత ఇలాంటి ప్రచారమే మళ్లీ జరగడం తో అందరిచూపు చిత్తూరు జిల్లా సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి వైపే వెళుతోంది. అందులోనూ చంద్రబాబు వైయస్సార్ తో సమకాలికుడు గా, ఆర్థికంగానూ మంచి పట్టు ఉన్న పెద్ద రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పపడతారా లేదా అనేది పక్కన పెడితే ప్రచారం మాత్రం ఎక్కువగానే ఉంది.

రోజా వ్యాఖ్యలు కీలకం

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో రోజా ఎదుగుదలకు ప్రధాన అవరోధం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఒక ముఖ్య మంత్రి నారాయణ స్వామి అని బలమైన ప్రచారం ఉంది. ఆమెకు అడుగడుగునా రాజకీయ అవరోధాలు సృష్టించడంతో పాటు, సొంత నియోజకవర్గంలోనూ వేరు కుంపటి పెట్టించడం లో ఈ ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరించారు అనేది రోజా అనుమానం. అంతగా బలం లేని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మీద రోజా తన కోపాన్ని బహిరంగంగా వ్యక్తం చేసినప్పటికీ, పెద్దిరెడ్డి మీద అలా చేసేందుకు ఆమె సహించలేదు.

అయితే ఆయనకు ఏదో రకంగా ఎర్త్ పెట్టాలని మాత్రం భావించే ఆమె, రిపబ్లిక్ టీవీ కథనాల తర్వాత వచ్చిన ప్రచారాన్ని మరింత బలం చేకూర్చేందుకు తమ పార్టీలోని వారే jagan కు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా 151 సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ కు పూర్తి ప్రజాబలం ఉంది. ఆయన ఎలాంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కోగల నేత. జగన్ మొండితనం, ఆయన రాజకీయ ఆలోచనలు దగ్గరనుంచి గమనించే నేతలు ఇంతటి సహసం చేసే అవకాశమే లేదు అన్నది వైఎస్ఆర్సీపీ నేతల మాట.

 

 

author avatar
Comrade CHE

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!