27న ఢిల్లీలో వైఎస్సార్‌సిపి నిరసన

అమరావతి, డిసెంబరు25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 27న వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను చేపట్టనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద డిసెంబర్‌ 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, పార్టీ నేతలు హజరుకానున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి వై‌ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నేతృత్వం వహించనున్నారు.