NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP Vs TDP: ‘మీ పార్టీ వాళ్లే ..కాదు మీ బంధువర్గీయులే’ .. విశాఖ డ్రగ్స్ కేసులో మాటల యుద్ధం

YSRCP Vs TDP: విశాఖ తీరంలో భారీగా మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) పట్టుబడిన ఘటన రాష్ట్రాన్నే కాక దేశాన్నే కుదిపేసింది. ఇంటర్ పోల్ నుండి వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ 25వేల కిలోల  డ్రగ్స్ ను సీజ్ చేశారు. కూనం వీరభద్రరావు కు చెందిన సంథ్య అక్వా ప్రైవేటు లిమిటెడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీబీఐ అధికారులు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో పెద్ద మొత్తం లో డ్రగ్స్ పట్టుబడటంతో ఇది రాజకీయ దుమారంగా మారింది. నిన్నటి రాత్రి నుండి సోషల్ మీడియాలో సదరు కంపెనీ యజమాని వైసీపీకి చెందిన వ్యక్తి అని టీడీపీ అభిమానులు, ఆయన బీజేపీ, టీడీపీ నేతల బంధువర్గం అని వైసీపీ అభిమానులు పోస్టులు పెడుతూ వచ్చారు.

ఎవరికి వారు వారి వాదనలు బలం చేకూరేలా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కూడా దీనిపై వైసీపీని విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి, బందరు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వైసీపీ, టీడీపీ నేతలు ఈ అంశంపై మాటల యుద్దం కొనసాగుతోంది.

విశాఖ డ్రగ్స్ కేసులో దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబు అండ్ కో అరుపులు ఉన్నాయని సజ్జల విమర్శించారు. పట్టుబడిన డ్రగ్స్ వెనుక చంద్రబాబు, పురందేశ్వరి గ్యాంగ్ లు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో పాటు సంబంధిత సంస్థలకూ ఫిర్యాదు చేస్తామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా బాబు అండ్ కో థర్డ్ గ్రేడ్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల. తప్పుడు రాతలు రాసిన పత్రికలపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వీళ్లు అరిచే అరుపులు చూస్తుంటే వీళ్లే దాని వెనుక ఉన్నారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు.

ఆ కంపెనీ చరిత్ర తీస్తే అంతా వారి కుటుంబాలకు దగ్గర గా ఉండే బంధువులేనని అన్నారు. తాము ఆరోపణలు చేస్తే వాళ్లు సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది పోయి ఉల్టా మాపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీనిలో కచ్చితంగా టీడీపీకి సంబంధించిన వారి ప్రమేయం ఉందని మేం బలంగా అనుమానిస్తున్నామన్నారు. వారి ఉలికిపాటు చూస్తుంటే దాన్ని తెచ్చి ప్రభుత్వంపై, వైసీపీపై నిందవేయాలని చూస్తుంటే వీళ్లు తప్పించుకోవడానికే నింద వేస్తున్నారని అనిపిస్తొందని అన్నారు.

పేర్ని నాని మాట్లాడుతూ విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులు బాబు చుట్టాలేనని, వారివి బీరకాయ పీచు బంధుత్వాలు అని అన్నారు. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాను తమ పార్టీ నేతలు కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.  చంద్రబాబు అవాస్తవాలతో వైసీపీపై చేసిన ట్వీట్ పైన చర్యలు తీసుకోవాలని సీఇఓకు ఫిర్యాదు చేశామని చెప్పారు. వదిన (పురందేశ్వరి),  మరిది (చంద్రబాబు) చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమోనని అనుమానంగా ఉందని అన్నారు.

TDP: టీడీపీ మూడవ జాబితా విడుదల ..11 అసెంబ్లీ, 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులు ఖరారు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju