NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

పోలీసులపై దాడి.. వైఎస్ షర్మిల అరెస్టు.. కేసిఆర్ సర్కార్ పై వైఎస్ విజయమ్మ ఆగ్రహం

YSRTP Chief YS Sharmila arrest

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఎస్ఐ పై చేయి చేసుకోవడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దురుసుగా వ్యవహరించడంపై ఆ శాఖ ఉన్నతాధికారులు దీని సీరియస్ గా తీసుకున్నారు. ఆమె పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిరుద్యోగ సమస్యలపై హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద దీక్షకు సిద్దమైన వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ వద్ద పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంలో పోలీసులతో షర్మిల వాగ్వివాదానికి దిగారు. తనకు ఎందుకు అపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే భైటాయించి నిరసన తెలిపారు.

YSRTP Chief YS Sharmila arrest
YSRTP Chief YS Sharmila arrest

 

దీంతో ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.   అయితే ఈ అరెస్టు క్రమంలో పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విధుల్లో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నందుకు షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.  కాగా ఈ ఘటనపై వైఎస్ఆర్ టీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎవరికీ భయపడనని పోలీసులకు హెచ్చరించారు షర్మి. తాను వైఎస్ఆర్ బిడ్డను కేసిఆర్ పంపించే పోలీసులకు అస్సలు భయపడబోను అని తేల్చి చెప్పారు. షర్మిలను అరెస్టు చేసి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించిన నేపథ్యంలో ఆమె తల్లి విజయమ్మ పీఎస్ వద్దకు చేరుకోగా పోలీసులు అనుమతించలేదు. దీంతో విజయమ్మ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

YSRTP Chief YS Sharmila arrest
YSRTP Chief YS Sharmila arrest

షర్మిలను కలవనివ్వడం లేదని అన్నారు. విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసుల తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ఈ పరిణామాలతో జూబ్లిహిల్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ టీపీ శ్రేణులు పీఎస్ వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే షర్మిలను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పనీ పాట లేక షర్మిలను అరెస్టు చేస్తొందని, షర్మిలకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి కేసిఆర్ సర్కార్ భయడపడుతోందని అందుకే కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. మరో పక్క షర్మిల భర్త బ్రదర్ అనిల్ న్యాయవాదులతో కలిసి పీఎస్ కు చేరుకున్నారు. పోలీసుల కేసులపై న్యాయపోరాటం చేస్తామని వైఎస్ఆర్ టీపీ శ్రేణులు పేర్కొంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!