NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Sharmila: కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల అల్టిమేటం..? .. విలీనం లేకపోతే 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ..

Share

YS Sharmila: వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీ .. కాంగ్రెస్ పార్టీలో విలీనంపై గత కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీలు అయ్యారు. కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్యవర్తిత్వంతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అడుగులు వేశారు. షర్మిలకు కర్ణాటక నుండి రాజ్యసభకు పంపుతామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే షర్మిల డిమాండ్ లపై పార్టీ అధిష్టానం ఇంత వరకూ ఏటు తేల్చకుండా మీన మేషాలు లెక్కిస్తొందట. షర్మిల ఢిల్లీకి వెళ్లి మరీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లతో సమావేశమై పార్టీ విలీనంపై చర్చలు జరిపారు.

YS Sharmila

సోనియా గాంధీతో షర్మిల భేటీ తర్వాత విలీనం ఖాయమైందనీ, ఆమెకు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీ నేలమట్టం కావడానికి కారణమైన వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై ఆయన వదిలిన బాణాన్ని తిరిగి పార్టీ అగ్రనాయకత్వం ప్రయోగిస్తొందని అందరూ భావించారు. ముందుగా షర్మిల సేవలను తెలంగాణలో వినియోగించుకోవాలని భావించినా, ఆమె సేవలను తెలంగాణలో కంటే ఏపీలో అయితేనే రాజకీయంగా ప్రయోజనకరం అని నేతలు అంచనాకు వచ్చారు. అయితే షర్మిల ఆలోచన మాత్రం తన రాజకీయం తెలంగాణలోనే అంటూ స్పష్టం చేస్తూ వచ్చారు. దీంతో ఇక్కడే విలీనంపై పీటముడి పడిందని అంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ బాగా బలపడి అధికారానికి చేరువ అవుతున్న తరుణంలో రాష్ట్ర విభజనకే ఒప్పుకోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మరల తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే అవకాశం ఉందనీ, తద్వారా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో షర్మిలను వ్యతిరేకించే వారు పార్టీ అధిష్టానం దృష్టికి తెచ్చారని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. నియోజకవర్గాల్లో అశావహులు ఇబ్బడి ముబ్బడిగా ఉండటంతో అధిష్టానానికి అభ్యర్ధుల ఎంపిక తలనొప్పిగా మారింది. ఈ తరుణంలో షర్మిల పార్టీ విలీనం అయితే ఎన్ని అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేస్తుంది, ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో ఆశావహుల పరిస్థితి ఏమిటి అనేది ఒక సమస్యగా మారింది. ఈ పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. దీంతో వైఎస్ షర్మిల ఇవేళ కీలక ప్రకటన చేసారు. ఈ నెల 30వ తేదీలోపు విలీనంపై కాంగ్రెస్ పార్టీ తేల్చాలి అన్నట్లుగా అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్ లపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించకపోతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని షర్మిల తేల్చి చెప్పేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుండి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ చేసేందుకు సిద్దంగా ఉందని చెప్పడంతో పాటు ఆక్టోబర్ రెండో వారం నుండి ప్రజల మధ్యే ఉండేలా కార్యచరణ చేపడతామని స్పష్టం చేశారు.

YS Sharmila

సోమవారం లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 33 జిల్లాల నుండి ముఖ్యనేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరు కాగా తన మనసులో మాటను వెల్లడించారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. పార్టీ విలీనంపై మాట్లాడుతూ తన తాపత్రయం అంతా తెలంగాణ కోసమే.. తెలంగాణ ప్రజల కోసమేనని చెప్పుకొచ్చారు. అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. ఈ నెలాఖరులోగా విలీనం కుదరకపోతే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నట్లుగా షర్మిల పేర్కొనడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

TS News: కేసిఆర్ సర్కార్ కు ఝలక్ ఇచ్చిన గవర్నర్ తమిళి సై .. ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వాలు తిరస్కరణ


Share

Related posts

బందరు ప్రాంత ప్రజలకు శుభ వార్త చెప్పిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma

Nandamuri : నందమూరి హీరో కి ఏకంగా గుడి పెట్టేస్తున్నారు అక్కడ..!!

sekhar

ఆయోధ్యలో ప్రధాని మొదట ఈ గుడిలోనే పూజ నిర్వహించారు !

Sree matha