బిగ్ బాస్ 4: అవినాష్ కోసం బరిలోకి జబర్దస్త్ టీం..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బ నవ్వించే షో జబర్దస్త్ షో. ఈ షో ద్వారా మంచి గుర్తింపు ప్రత్యేకమైన ఇమేజ్ పాపులారిటీ సంపాదించారు అవినాష్. అటువంటి అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతూ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. టాస్క్ లో కూడా భారీ స్థాయిలో రాణిస్తున్నాడు. అందరినీ నవ్విస్తూ ఉండే అవినాష్ ఫస్ట్ టైం నామినేషన్ లోకి రావడంతో… అవినాష్ నీ సేవ్ చేయటం కోసం జబర్దస్త్ టీం బరిలోకి దిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Bigg Boss Telugu 4: Did Avinash Pay Rs 10 Lakh To Jabardasth Makers To  Enter Nagarjuna's Show? - Filmibeatతమ తోటి కమెడియన్ కావటంతో అవినాష్ ని సేవ్ చేయాలని జబర్దస్త్ కంటెస్టెంట్ లు ఎవరికి వారు తమ సోషల్ మీడియాలో ఉండే అకౌంట్ల ద్వారా ఫ్రీ పబ్లిసిటీ చేస్తూ… అండగా నిలబడుతున్నారు. దయచేసి అవినాష్ ని సేవ్ చేయండి సపోర్ట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్ల ద్వారా అవినాష్ కి ఫుల్ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే రాకింగ్ రాకేష్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు. ఓట్ ఫర్ అవినాష్ అంటూ చెప్పుకొచ్చాడు.

 

దాంతో పాటు మరికొంతమంది జబర్దస్త్ కమెడియన్ లు అవినాష్ కి అండగా నిలబడుతు బిగ్ బాస్ టైటిల్ గెలిచే రీతిలో బయట కృషి చేస్తున్నట్లు సమాచారం. చాలా కష్టాలలో నుండి బిగ్ బాస్ గేమ్ లో అవినాష్ రావడంతో ఎలాగైనా అవినాష్ ని గెలిపించాలని… జబర్దస్త్ కమెడియన్ లు కృషి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.