NewsOrbit
వ్యాఖ్య

గాంధీ గారితో స్వగతం!

There is only one Christian and he died on the cross అన్నాడు బెర్నార్డ్ షా
There is only one Gandhi and we killed him అన్నది బీనాదేవి
రేపు గాంధీ వర్ధంతి
గాంధీ నిన్ను మేము మరిచిపోలేదు
రేపు నీ సమాధికి పువ్వుల దండలు వేసి నివాళులు అర్పిస్తాము
మూడు నిముషాలు మౌనం పాటిస్తాం
కొంతమంది పెద్దలు స్పీచ్‌లు ఇస్తారు
నీ  ఆశయాలు అనుసరిస్తాం అంటారు
నీ అడుగుజాడల్లో నడుస్తాం అంటారు
కానీ గమ్మత్తు చెప్పనా
నువ్వు అహింసతో తెచ్చిన స్వరాజ్యానికి నిన్ను చంపి హింసతో ప్రారంభోత్సవం చేసేం
హింసే మా ఊపిరిగా బతుకుతున్నాం
ఏవన్నావు నువ్వు
ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరిగిననాడే మనకి స్వరాజ్యం వచ్చినట్టు అని కదూ
ఎంత  అమాయకుడివి
ఇప్పుడు పట్టపగలు మొగాడు కూడా ధైర్యంగా బైటికి వెళ్ళలేడు
అంత  అరాచకంలో బతుకుతున్నాము
ఈ హత్యలు అత్యాచారాలు అవినీతి ఉన్న దేశంలో నీలాటి వాళ్ళకి చోటు లేదు
నీ లాటి వెయ్యిమంది గాంధీలు వచ్చినా  ఏవి చెయ్యలేరు
నువ్వే ఉంటే కర్ర బదులు కత్తి  పట్టుకొనేవాడివి
ఒద్దు గాంధీ నువ్వు మళ్ళీ  పుట్టొద్దు
ఇప్పుడు మాకు డబ్బు జబ్బు పట్టుకుంది
డబ్బుకి బానిసలం ఐపోయేము.
నువ్వు బ్రిటిష్ వాళ్ళ నించి బానిసత్వం పోగొట్టేవు
మరి ఇప్పుడు ఈ బానిసత్వం పోగొట్టడం ఎవరి తరం కాదు
ఇపుడు మాకు అమెరికా గాయత్రీ మంత్రం అయిపోయింది
ఇప్పుడు పుట్టిన పిల్లలు అమ్మ అనడం లేదు
అమెరికా అంటున్నారు
ఈ దిక్కుమాలిన భావదాస్యం నుండి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు
నువ్వు ఆఫ్రికాలో నల్లవాళ్ల తరఫుని పోరాడేవు
నిజానికి వాళ్ళు నీ దేశస్తులు కారు ఐనా నువ్వు వాళ్ళని కాపాడావు
నువ్వు న్యాయవాదివి  అందుకే న్యాయం కోసం పోరాడేవు
వాళ్ళు నిన్ను మరిచిపోలేదు
గ్లోబలైజేషన్  ధర్మవా  అని మన సంస్కృతీ సంప్రదాయం అన్నీ మంట కలిసిపోయాయి
ఇప్పుడు మనది భారతదేశం కాదు
కేవలం అమెరికా వలస దేశం అంతే
ఏవన్నావు నువ్వు
చెడు  వినకు చెడు  చూడకు చెడు  మాట్లాడకు అని కాదూ
ఏవి అమాయకత్వం
చెడు  చెయ్యకు అనలేదు
అంచేత మేవు అదే చేస్తున్నాం
అన్నట్టు మరిచిపోయేను మొన్ననే రిపబ్లిక్ డే జరుపుకున్నాం
యెంత హడావిడి యెంత హంగామా
ఇక్కడ మా భారత దేశంలో ఎక్కువ కబుర్లే కానీ సమాజ స్వరూపం మార్చే సాహసం కనిపించడం లేదు అని శ్రీశ్రీ ఏనాడో గోల పెట్టేడు
అతని గోల నా గోల ఎవడు వింటాడు
పేరు ప్రజాస్వామ్యం ఉన్నది ధనస్వామ్యం
ఏవిటో గాంధీ నా  ఆలోచనలు భావాలూ చెప్పుకోడానికి ఎవరూ లేక నీతో చెప్పుకున్నాను
ఏవి అనుకోవుకదూ
మళ్ళీ  నీ  జయంతికి బతికుంటే కలుస్తాను

 

      బీనా  దేవి 

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment