ఈ మధ్య పేపర్లో తరుచు మిస్సింగ్ కేసులు చూస్తున్నాను
పరీక్ష పోయిందని పారిపోవడం
హోంవర్క్ చెయ్యలేదని ఆ కుర్రాడు పారిపోయేడు
చెయ్యకపోతే ఏవిటి మర్నాడు చెయ్యవచ్చు కానీ టీచర్ భయం
ఎంట్రన్స్‌లో సీటు రాలేదు ఆత్మహత్య
రాకపోతే కొంపలు ములిగిపోవు మళ్లీ రాయవచ్చు
భార్య భర్తలు తగువులు అంతే భార్య ఆత్మహత్య
తగువులు లేని సంసారం ఉండదు అంతమాత్రాన చనిపోనక్కర లేదు
ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఒకేలా ఉండరు
మరి ఎక్కడో పుట్టి పెరిగిన ఇద్దరు కలిసి ఉండాలంటే సర్దుకు పోవాలి
ప్రపంచంలో యే యిద్దరి అభిప్రాయాలూ ఒకేలా ఉండవు
ఉండలేకపోతే వేరే వెళ్ళిపో
పారిపోవడం ఆత్మహత్య దేనికీ పరిష్కారం కావు
నిజానికి అన్ని సమస్యలూ మనం తెచ్చుకున్నవే
పారిపోయినంత మాత్రాన ఏ సమస్యా పోదు
ఎందుకు ఇన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయో ఎవరైనా ఆలోచించేరా
మిస్సింగ్ కేసులు యెంత ఎక్కువ అంటే వీటిని వెంటనే దర్యాప్తు చెయ్యమని హైకోర్టు ఆర్డర్ వేసింది
వీళ్లలో కొందరు శవాలుగా దొరుకుతున్నారు
అసలు ఎందుకు ఇలా జరుగుతోంది
సహనం లేక ఓటమి ఒప్పుకోక
చిన్నప్పటి నుంచి పిల్లలకి ఓటమి నేర్పాలి
ఎప్పుడూ మనవే గెలవాలి అనుకోకూడదు
ఒకప్పుడు రకరకాల ఆటలు ఉండేవి
వైకుంఠపాళి అష్టాచమ్మా క్యారమ్స్ వగైరా
వీటిలో గెలుపు ఓటమి రెండు ఉంటాయి
ముఖ్యంగా వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కడం పాము మింగెయ్యడం
మళ్లీ మొదటికే రావడం
జీవితమింతే అని తెలుస్తుంది
జీవితంలో ఆటుపోట్లు తప్పవు
కోటీశ్వరుడు అప్పులు తీరలేదని ఆత్మహత్య చేసుకున్నాడు
రైతు అదే పని చేసేడు
కేవలం డబ్బు ఆ పని చేయించింది
బతికివుంటే ఎప్పుడైనా తీర్చుకోవచ్చు
వాళ్ళకి అంత ఓర్పు లేదు
బాధలు కష్టాలు లేనివాళ్లు ఎవరూ లేరు
వాటిని భరించడం నేర్చుకోవాలి
చిన్నప్పుడే అలవాటు కావాలి
దానికి ఆటలు అవసరం
ఇప్పుడు ఆటలు లేవు కంప్యూటర్ గేమ్‌లో ఓటమి ఉండదు
రిమోట్ తిప్పడవేఁ పిల్లలకి మొట్టమొదట నేర్పవలసింది ఓటమి
అమ్మ నాన్న టీచర్ ఈ ముగ్గురూ బాధ్యులు
ఇప్పుడు వాళ్ళు నేర్పడం లేదు
ఎప్పుడూ మరొకరితో పోల్చకూడదు
ఎవరి ప్రతిభ వాళ్ళది
నేను గోర్కీతో పోల్చుకుంటే అక్షరం రాయలేను
ఇప్పుడూ ఎవరికీ ఓర్పు లేదు
పట్టుదల అసలే లేదు
ఆ మిస్సింగులు ఆత్మహత్యలు పోవాలి అంతే
ముందు మారవలసింది అమ్మ నాన్నలు
తరవాత టీచర్లు
అమ్మ నాన్నలకి పాపం తీరిక లేదు
టీచర్‌కి బాధ్యత లేదు
కష్టాలు బాధలు ముష్టివాడు మొదలు మహారాజు వరకు అందరికీ ఉంటాయి
వాటి నుంచి పారిపోతే అవి పోవు
ఈ పరిస్తితులు ఇలాగే ఉంటే మిస్సింగ్ కేసులకి వేరే పోలీస్ స్టేషన్ పెట్టాలి
అందరూ ఆలోచించండి
చేతులు కాలేక చెట్లు పట్టుకుంటే లాభం ఉండదు
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ