NewsOrbit
వ్యాఖ్య

కలయికలే జీవితం!

ఇప్పుడంతా చిన్నప్పటి జ్ఞాపకాల తోటల్ని వెదుక్కుంటూ పక్షుల్లా ఎగురుతున్నారు. ఎప్పుడో పదో తరగతో..ఇంటర్మీడియట్టో చదివిన స్నేహితుల్ని అన్వేషించుకుంటూ తమ తెలిసిన గోళాలన్నీ తిరుగుతున్నారు. ఫేస్ బుక్కులూ వాట్సాప్‌లూ,  ఇంటర్ నెట్ సెంటర్ పాయింట్ అయింది. మొత్తానికి ఎలాగోలా బాల్య స్నేహితుల్ని పట్టుకుంటున్నారు. అందరూ కలిసి ఒకసారి చిన్నప్పటి బడులకూ కాలేజీలకూ వెళ్ళి తీర్థస్థలంలా దర్శించి మరోసారి నడిచిన జీవితమంతా గడిచిన అన్ని కష్టాలనూ కన్నీళ్ళూ సుఖాలనూ సంతోషాలనూ పంచుకుంటున్నారు. అలా కలిసినప్పుడు ఒక్కసారిగా అందరూ పిల్లలైపోతున్నారు. వాళ్ళు చదువుకున్న బడులు..కాలేజీలూ పూలతోటలై పరిమళిస్తున్నాయి. అందుకే నేనూ నా బాల్యపు క్లాస్ మేట్స్ కోసం వెదకడం మొదలు పెట్టాను. ఒక మిత్రుడు ఇంటర్ మీడియట్ (ఓరియంటల్ భాషాప్రవీణ) నాటి గ్రూప్ ఫోటో ఒకటి పంపాడు. దాన్ని చూడగానే గుండె ఒక్కసారిగా ఝల్లుమంది. అందరం ఎప్పుడు కలుస్తామో కాని, ఇదిగో తక్షణమే ఈ కవిత వచ్చింది.

కాలేజీ ఫోటో

గుండెలో నిలకడగా వున్న నీళ్ళ మీద ధడాల్మని చేదలా పడింది ఓ ఫోటో

మొదలైన తియ్యని కలకలంలోంచి అది మరికొన్ని ఫోటోలు పైకి తోడింది

ఫ్రేములు ఫ్రేములు ఫ్రేములుగా  పటాలు పటాలు పటాలుగా దృశ్యాల్ దృశ్యాలు అలల్లా

 వాడెవడో నాలాగే వున్నాడు బాల్యానికీ యవ్వనానికీ మధ్య  అమాయకంగా నవ్వుతున్నాడు

అతని నూనూగు మీసాల మీద ఆకుపచ్చ నూగారు కలలు

అమ్మ చనుబాలను అప్పుడే చవిచూసినట్టు కొత్తకొత్త పుస్తకాల్లోంచి కొత్తకొత్త అక్షరాలతో

ఆడుకుంటున్న అబ్బాయిలు..అమ్మాయిలు.

కొత్త ఊపిరి కొసలకు ఊగుతున్న కొత్త ఊహలు..కొత్త ఊసులు..

కొత్త నిద్రలూ మెలకువలూ ఉదయాస్తమయాలూ.. ఫ్రేములు ఫ్రేములు ఫ్రేములు

చెక్క కుర్చీలో రోజూ ఉదయించే సూర్యులు.. జ్ఞానకిరణాలను కడుపార గ్రోలిన త్రేన్పులు..

స్నేహం దయాంచ సౌఖ్యం చ యదివా జానకీమపి…పొలాలనన్నీ హలాల దున్నీ..

భవభూతి నుండి శ్రీశ్రీ వరకూ పద్యాలు శ్లోకాలు గేయాలు

పక్షులై తరగతి గదిని ఆకాశం చేసుకున్న రెక్కల చప్పుడు

పద్యాన్నీ మద్యాన్నీ తొలిసారి రుచి చూసిన మైకంతో  ఒక పటం ఊగింది

మబ్బుల్ని పేగుల్లోంచి తీసి  పొగలుపొగలుగా వదిలి దగ్గుకున్న క్షణాలను ఒక పటం వొంపింది

ఆడిన నాటకాలు..పాటలై చుట్టుకున్న వ్యాపకాలు

కబడి కబడి కబడి కబడ్డీ.. సూర్యా చంద్రులతోటి చుక్కల్లతోటి

ఆటాడుకున్న పలవరింతలతో ఒక పటం త్రుళ్ళిపడింది

 రింగురింగుల ముంగురులతో  మాటలాడించిన  మునివేళ్ళ మర్మాలు

గాల్లో వేలాడిన తొలిచూపుల ప్రేమలేఖలు

అర్థచంద్రాకారపు వీపుల మీది  లిపిని చదివిన భాషా నైపుణ్యాలు

బొటన వేళ్ళతో నేల మీద వేసిన బొమ్మలకు సాష్టాంగ ప్రమాణాలు

క్రూరాతి క్రూర దరహాసాల  రంగులు రాల్చి నవ్వింది ఓ పటం

అలకలు..అల్లర్లు..తగాదాలు..

మనసుల్ని బట్వాడా చేసిన తపాలా బంట్రోతులు

చెరువుల్లో కాలవల్లో ఈతలు.. గట్ల మీద గుండెల్ని ఆరబెట్టుకున్న సాయంకాలాలు

అరికాళ్ళలో హీరోయిన్ల కితకితలు ఛాతీల మీద హీరోల స్టెప్పులు

కాలినడకన రెండో ఆటకు  పగలంతా పథకాలు

ఏ వ్యూహాలూ తెలీని స్నేహాలు.. ఫ్రేములు ఫ్రేములు ఫ్రేములు..

పరీక్షల కోసం  నురగలు కక్కిన  రాత్రులు

చందమామ గిన్నెను తిరగేసి బోర్లేసి  వండిన వంటలో

ఒకడు ఉప్పూ  ఒకడు కారం ఒకడు మసాలా

ఒకడు నీరూ ఒకడు నిప్పూ

ఒక్క ఫోటో

బుర్రను కవ్వం చేసింది

హృదయాన్ని రంగుల రాట్నం చేసింది

కళ్లలోంచి  జలజలా జ్ఞాపకాలు రాల్చి

వొళ్ళంతా ముద్దముద్ద చేసింది

చూశారా..కేవలం ఫోటో చూస్తేనే ఇంత కలవరం..ఇంత ఆహ్లాదం..ఇంత ఉద్వేగం కలిగాయి. మరి కలుసుకుంటే ఏమవుతుంది? కలయికలే జీవితం. కలయికల జ్ఞాపకాలే జీవన సౌందర్యం అని ఒక కవితలో రాశాను. నిజమే కదా. కలుసుకోవాలి. నేను కూడా నా బాల్య మిత్రుల్ని కలుసుకోవాలని మీరూ విష్ చేయండి మరి.

డా. ప్రసాదమూర్తి

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment