NewsOrbit
వ్యాఖ్య

తిరోగమనం

ఓరె ఏవిటా కల్లు కాంపౌండ్ కల్చర్ గ్లాసులో పోసుకొని తాగలేవూ తిట్టేను మా మనవడిని
వాడు నావైపు ఓవిలన్ చూపు విసిరేడు
ఔనోరే నువ్వు యూకే లో చదివేవు కదా వాళ్ళ అలవాట్లు రాలేదా
బ్రిటిషువాళ్ళ ఏటికెట్ చాలా బావుంటుంది
వాళ్ళ టేబుల్ మేనర్ లు బావుంటాయి
అమెరికా వాళ్ళ దగ్గర తాగడం మాత్రం నేర్చుకున్నాము
సిరి అబ్బకపోయినా చీడ అబ్బుతుంది
మనం వాళ్ళ దగ్గర ఏవీ నేర్చుకోలేదు
ఒకప్పుడు పీటలు మీద కూర్చొని భోజనం చేసేవారు పక్కన చెంబుతో నీళ్లు ఓ గ్లాసు ఉండేవి
నీళ్లు గ్లాసులో పోసుకొని తాగేవారు
నెమ్మదిగా నాగరికత పెరిగి పీటలు పోయి టేబుల్ వచ్చింది
చెంబులు పోయి జగ్గులు వచ్చేయి
నాగరికత మరీ పెరిగి ఇప్పుడు సీసాతోనే తాగుతున్నారు
పెరిగింది నాగరికత కాదు బద్దకం
ఇది లేటెస్ట్ ట్రెండ్
ఇంకా లేటెస్ట్ మంచినీళ్లు బదులు అన్నం తింటూ కోక్ తాగుతున్నారు
దీని పేరు అభివృద్ధి
మరొక తమాషా తాగిన సీసా మళ్లీ ఫ్రిజ్ లో పెట్టేస్తారు
అదే సీసా మరొకరు తాగుతారు
ఒకరు తాగినది మరొకరు తాగడం మంచిదా
హోటల్ కి వెళ్లి చూడండి
అమ్మాయిలు అబ్బాయిలు కోక్ ఒకే సీసా తో తాగుతారు
ఒకరి ప్లేటు లోది మరొకరు తీసుకోని తింటారు
చూస్తే పరమ వికారంగా ఉంటుంది
యీ కల్చర్ పేరేవిటో
నేను పెట్టిన పేరు కల్లు కాంపౌండ్
అంటే మనం ఇంకా ఆది మానవుడి దశలోనే ఉన్నాం
అంతటితో అయిపోలేదు
డైనింగ్ టేబుల్ కేవలం ఒక షో మాత్రమే అక్కడ ఎవరూ తినరు
పైగా అది ఒక స్టోర్ రూమ్ లా ఉంటుంది దాన్నిండా సామానే
చక్కగా హల్లో సోఫాలో మఠం వేసుకుని ఒళ్ళో ప్లేటు పెట్టుకొని ఒక చేత్తో రిమోట్ పట్టుకొని
టీవీ చూస్తూ తింటారు టైము లేక కాదు
టీవీ కోసం నాలాటి వాళ్ళు ఏవైనా అంటే
ఏం ఫంక్షన్ల లో బఫేలో తినడం లేదా వెధవ చాదస్తం నువ్వునూ అని సణుగుతారు
మనం ఆటవికత నుంచి ఆటం బాంబు వరకు ఎదిగేమ్
మరి మళ్లీ వెనక్కి పోతున్నామా. ఎందుకో తెలీదు
ఎక్కడికో తెలీదు
మానవత మాట ఎలావున్నా మంచి గుణాలు మంట కలిసిపోతున్నాయి
మంచినీళ్ళ దగ్గర ప్రారంభించి మానవత దగ్గరకి వెళ్లేవేవిఁటి అంటారా
నిజానికి మంచినీళ్లు గ్లాసులో పోసుకోలేనంత బిజీ కాదు అదొక షో
మనం చేసే ప్రతి పనికి ఓ దానితో ఒకటి లింక్ ఉంటుంది
ఒకరి ఎంగిలి ఒకరు తాగితే జబ్బులు వస్తాయని తెలీదా
అంటూ సొంటు మాట దేవుడెరుగు శుచి శుభ్రం అక్కర్లేదా
తెలుసు నిర్ల్యక్షం అంతే
మళ్లీ మొదటికే వెళతాను
వీటికి కారణం అమ్మ నాన్న వాళ్ల పెంపకం
పిల్లలకి మంచి అలవాట్లు నేర్పడం వాళ్ళ బాధ్యత షోకులు ఫ్యాషన్లు కాదు
మొక్కై వంగనిది మానై వంగదు కనీసం ఇల్లంతా తిరుగుతూ పళ్ళు తోముకొనే అసహ్యవైన
అలవాటు మానిపించండి
ఈవిడ ఇంత చిన్న వాటికీ అంత రభస చేస్తోంది ఏవిటి అంటారేమో
చిన్న విషయాల్లోనే మనిషి మెంటాలిటీ తెలుస్తుంది
ఇవన్నీ social evils
ఆది మానవుడికి బాత్ రూమ్ లు వాష్ బేసిన్ లు లేవు
ఉండీ మనం ఏం చేస్తున్నావు
కాలాన్ని చక్రంతో పోలుస్తారు అది ప్రారంభించిన చోటికే మళ్లీ వస్తుంది
బహుశా మనం కూడా అంతే నేమో
వెనక్కి వెళ్తున్నావా
నాగరికత పేరుతో దిక్కుమాలిన అలవాట్లు చెయ్యకండి
చిన్నప్పటి అలవాట్లు ఎప్పటికి పోవు
నేను ఎప్పుడూ పిల్లల్ని నిందించను
వాళ్ళని పెంచే తల్లి తండ్రులదే తప్పు
వాళ్ళు గ్రహిస్తే చాలు
ఇప్పటికీ మించిపోయింది లేదు
Better late than never

బీనాదేవి 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment