NewsOrbit
వ్యాఖ్య

ఎవరికి పుట్టిన బిడ్డయినా..!

అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని ఎవరో రోడ్డు మీద వదిలేసేరు
కనీసం ఒక దుప్పటి అయినా కప్పలేదు
పాపం వాడు చలికి ఏడుస్తూ ఉంటే ఎవరో చూసి పోలీసులకి ఫోన్ చేసేరు
వాళ్ళు వాడిని శిశువిహార్‌కి అప్పచెప్పేరు
ఇది కొత్త కాదు తరుచు జరుగుతున్నాయి
ఇది ఇవాళ కొత్తకాదు అలనాడు కుంతి  కొడుకుని బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది
అప్పుడు పోలీసులు, శిశువిహార్లు లేవు
నదిలో స్నానం చేస్తున్న ఒక సూతుడు చూసి ఆ పిల్లాడిని పెంచుకున్నాడు
అతనే కర్ణుడు
మరి ఇప్పుడు ఆలా పెంచుకొనేవాళ్ళు ఎవరూ లేరు
ఎందుకూ
వాడి కులం మతం ఏవిటో అని భయం
నాకు తెలీక  అడుగుతాను
మీ సర్రొగసీ వల్ల  పుట్టిన పిల్ల మీ స్వంతవేనని  గ్యారంటీ ఉందా
వాళ్ళు చెప్పడం నువ్వు నమ్మడం అంతే
నువ్వు డబ్బు ఇస్తావు వాళ్ళు పిల్లని ఇస్తారు దట్సాల్
అప్పుడు కర్ణుణ్ణి పెంచుకున్నవాళ్ళు ఇవి ఆలోచించలేదు
మనకి ఆ మంచితనం లేదు
ఆ పిల్లని నువ్వే పెంచుకోవచ్చు. నీ పిల్లలతో పాటే ఉంటాడు
స్వార్థం అంతే
ప్రతివాడికీ కులం గోత్రం వగైరా కావాలి
ఇంతకీ వాళ్ళు అలా ఎందుకు వదిలేసేరు
పెళ్లి కాకుండా పిల్లని కనడం తప్పుట
పిల్లని కనాలంటే ఆడదానికి పెళ్లి అనే లైసెన్సు కావాలి
మొగాడికి  అక్కర్లేదు అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి
ఆ మనువు మహానుభావుడు కొన్ని అమెండుమెంట్లు ఇచ్చేడు
పిల్లలు లేకుండా భర్త పొతే వాడికి సద్గతి ఉండదుట
మరి ఎలా
అంచేత భార్య అతని అన్నదమ్ముల్లో ఒకరికి కొడుకుని కంటే భర్తకు సద్గతి ప్రాప్తిస్తుందిట
కేవలం మొగుడి సద్గతి కోసం ఆవిడ కొడుకుని కనాలి
కొడుకు లేకపోతే నరకవే గతా  భేష్ ఏవి శాస్త్రవండి
అప్పుడు ఆవిడ  పతిత కాదుట
అందుకే కుంతిని ఎలాగైనా సరే కొడుకుల్ని కనమని లైసెన్స్ ఇచ్చేసేడు పాండురాజు
సద్గతి కోసం కాదు రాజ్యం కోసం
వాళ్ళని మనం అక్రమ సంతానం అనకూడదు
అన్నట్టు మరిచిపోయేను
ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది బాగా డబ్బు, పేరు ఉన్న ఆడ మొగ పెళ్లి చేసుకోవడంలేదు
కానీ డబ్బు అనుభవించడానికి పిల్ల కావాలి ఎలా
ఏవుంది సర్రోగేసీ
ఆడది  పెళ్ళిలేకుండా పిల్లని కనడంలేదు తెచ్చుకుంటోంది
ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలీదు మరి తండ్రి పేరు ఏవిటి రాస్తుంది
వాడి కులం తెలీదు దొంగో దొరో  తెలీదు
ఇది సక్రమ సంతానవేనా
ఈ శాస్త్రాలు చట్టాలు అన్ని దిగువ తరగతివాళ్ళకే
డబ్బుంటే అన్నీ సక్రమవే
రాజు గారు చేస్తే రసికత్వం చాకలాడు  చేస్తే రంకుతనం
ఇంతకీ ఈ గోల  ఎందుకంటే ఆడది  మోసపోయి పిల్లని కంటే ఆవిడని బతకనివ్వరు
ఆ పిల్లని చులకనగా చూస్తారు
అందుకే రోడ్డు మీద తుప్పల్లోనూ పిల్లలు దొరుకుతారు
జంట నగరాల్లో స్ట్రీట్ చిల్డ్రన్ ఎంతమందో తెలుసా నలభైవేలు
చాల మందికి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలీదు
అనాధాశ్రమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు
అందుకే ఆ పిల్లలు భావి భారత దొంగలు హంతకులుగా మారుతారు
వాళ్ళ తప్పు లేదు
తప్పంతా మన శాస్త్రాలది
అలనాటి కుంతీ మొదలు ఇంత వరకు  మారలేదు
యుగాలు మారేయి  టెక్నాలజీ పెరిగింది
కానీ మనం మారలేదు
నేను అవినీతిని ప్రోత్సహించడం లేదు
కానీ పరిస్థితుల  ప్రభావం వల్ల  ఎవరైనా పెళ్లికాని అమ్మాయి పిల్లని కంటే
వాళ్ళని పారెయ్యడం న్యాయం కాదు అంటున్నాను
ప్రతి ఆడదానికీ విత్ ఆర్ వితౌట్ పెళ్లి పిల్లని కనే  హక్కు ఉంది
అక్రమం సక్రమం అని లేదు
తల్లి తండ్రి లేకుండా పిల్ల పుట్టదు
తల్లి నిజం తండ్రి నమ్మకం
ప్రతి ఆడది తన పిల్లని పెంచుకోగలగాలి
తండ్రి పేరు పబ్లిక్‌గా  చెప్పగలగాలి
అప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టు
పాండవులు పాండురాజు పిల్లలు కారు
కానీ పాండవులుగానే చెలామణి అయ్యేరు
మరి మనం పురాణాల్ని ప్రమాణాలుగా తీసుకుంటావుకదా
ఇదెందుకు తీసుకోం
అంతెందుకు భారతం రాసిన వ్యాసుడు సత్యవతికి పెళ్లి కాకుండానే పుట్టేడుకదా ధృతరాష్ట్రుడు, పాండురాజు అక్రమసంతానం కాదా
మరి వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు వీళ్ళని కూడా చెయ్యండి
తల్లి తన పిల్లని పెంచుకోనివ్వండి
రోడ్డు పాలు కుక్కల పాలు చెయ్యకండి
అప్పుడు యీ  శిశువిహార్‌లు అనాధ శరణాలయాలు అవసరంలేదు
దొంగలు హంతకులు ఉండరు
ఇది చాల మందికి అరగదు  కానీ నిజం
మోసం చేసిన మొగాడిని నిలదియ్యండి
ఏ పాపం చెయ్యని పసివాళ్ళని బలి చెయ్యకండి

-బీనా దేవి

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment