NewsOrbit
వ్యాఖ్య

చీపురు చూపుతున్న దారి!

నేను స్వచ్ఛమైన నీటి సరఫరా అంటున్నాను

వారు షాహీన్ బాగ్ అంటున్నారు

నేను కారు  చౌకగా నిరంతర కరెంటు అంటున్నాను

వారు షాహీన్ బాగ్ అంటున్నారు

నేను సకల సదుపాయాలతో సర్కారీ బడులు అంటున్నాను

వారు షాహీన్ బాగ్ చూపిస్తున్నారు

నేను అందరికీ అందుబాటులోకి సర్కారీ దవాఖానా అంటున్నాను

వారు షాహీన్ బాగ్ అంటున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీద మూడోసారి కూర్చోబోతున్న కేజ్రీవాల్ ఈ ఎన్నికల ప్రచారంలో ఇవే మాటలు పదేపదే చెబుతూ వచ్చారు. మరికొన్ని గంటల్లో ఢిల్లీ వాసులు తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోడానికి క్యూలో నిలబడతారు. ఈవీఎంలలో ఎలాంటి ‘ మోషా’ ల మాయలూ జరక్కపోతే కేజ్రీవాల్ గెలుపు నల్లేరు మీద బండి నడక అని సర్వేలు చూసినా, ఈ నెలరోజులూ సాగిన ప్రచారం తీరుతెన్నులు చూసినా అర్థమైపోతుంది. కేజ్రీవాల్ గెలుపు కేజ్రీవాల్‌కి వ్యక్తిగతంగా పేరుప్రఖ్యాతులు తీసుకువస్తాయి. అది అతనికే పరిమితం కాదు. దేశమంతా చెల్లుబాటైన మోదీ, షాల మతరాజకీయ క్రీడావిన్యాసం ఢిల్లీలో ఎందుకు చతికిలపడిందో ఇకనైనా దేశం అంతా ఆలోచించుకోడానికి ఈ విజయం పునాది కావొచ్చు. పరువుగలవాళ్ళం  అనుకుంటున్న హేమాహేమీలు ఢిల్లీ ప్రచారంలో చాలా బ్రహ్మాండంగా తమ పరువు తీసేసుకున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సహా ఢిల్లీ ప్రచారంలో పాల్గొన్న మంత్రులు ముఖ్యమంత్రులు ఎంపీలూ అంతా తరతమ భేదం లేకుండా ఢిల్లీ వీధుల్లో విద్వేషాగ్నులు రగిలించడానికి శాయశక్తులా కసరత్తులు చేశారు.

తూర్పు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తూ యూపీ సి.ఎం. యోగి ఆదిత్యనాథ్ షాహీన్ బాగ్ నిరసనకారులను కాశ్మీర్ టెర్రరిస్టుల మద్దతుదారులుగా  అభివర్ణించాడు. వారికి  కేజ్రీవాల్ బిర్యానీ సప్లయ్ చేస్తున్నాడని నిందించాడు. ఆయన ద్వేషపూరిత ఉపన్యాసానికి కొన్ని గంటల తర్వాత  ఇరవై అయిదేళ్ళ కపిల్ గుజ్జార్ అనే కుర్రాడు షాహీన్ బాగ్ నిరసనకారుల మీద కాల్పులు జరిపాడు. దేశ్ మే కిసీకీ నహీ చెలేగీ సిర్ఫ్ హిందువోంకీ చెలేగీ. జై శ్రీరాం, హిందూ రాష్ట్ర్ జిందాబాద్  అన్న నినాదాలతో చెలరేగిపోయాడా కుర్రాడు. కేంద్ర ఆర్థిక శాఖ సహయ మంత్రి అనురాగ్ ఠాకూర్ గొప్ప హనుమాన్ భక్తుడు. బడ్జెట్‌లో హనుమాన్ లీలలు చూపించలేకపోయాడు కానీ  ఈ భక్తుడు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దేశ్ కే గద్దారోంకో గోలీమారో అనే నినాదాల మధ్య ప్రసంగాల కుప్పిగంతులు చాలానే వేశాడు. దానికి సరిగ్గా రెండు రోజుల్లోనే మహాత్మా గాంధీ వర్థంతి రోజున జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఒక యువకుడు పిస్తోలు పట్టుకుని రెచ్చిపోయాడు. ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. ఇదంతా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న పోలీసుల సమక్షంలో జరిగిందే. నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. మరి కార్యకర్తలు తూటాలతో తప్ప మరో రకంగా ఎలా మాట్లాడగలరు? జనవరి 25న బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ మదిపూర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఒక టెర్రరిస్టు అని ప్రకటించాడు. ఇవన్నీ కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రధాని మోదీ, అమిత్ షాలు సి.ఎ.ఎ., ఎన్నార్సీల ఆయుధాలనే ప్రయోగించి ఢిల్లీవాసుల మనస్సులు గెలవాలని ప్రయత్నించారు. ఎన్నికల్లో గెలవడానికి వారికి తెలిసిన సూత్రం ఒకటే. అదే మతం. దాని ప్రాతిపదిక మీదే తమ రాజకీయ జీవితాలు ఆధారపడ్డాయన్నది వారి వ్యూహం.

ఎవరు ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా కేజ్రీవాల్ మాత్రం కేవలం నాలుగే నాలుగు మౌలికమైన అంశాల మీద తన సర్వశక్తులనీ కేంద్రీకృతం చేశాడు. విద్య, వైద్యం, బిజిలీ, పానీ. గత 70 ఏళ్ళుగా ఎవరూ చేయనిది చేసి చూపించాడు. అయిదేళ్ళలో సాధ్యమైనది 70ఏళ్ళలో ప్రయత్నాలైనా సాగి వుంటే దేశ ముఖచిత్రం మరోలా వుండేదని కేజ్రీవాల్ విశ్వసనీయంగా చెప్తున్నాడు. ధనవంతుల పిల్లలు కూడా సర్కారీ స్కూళ్ళలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. జలగల్లా జనాన్ని పిండిపారేసే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి విముక్తి దొరుకుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కాలుష్యానికి కేంద్రమైన ఢిల్లీలో స్వచ్ఛ జలాన్ని అందరికీ అందించడం సాధారణ విషయం కాదు. ఇప్పటికే దాదాపు 80శాతం పైగా ప్రాంతాలకు శుభ్రమైన  నీరు అందించడంలో ఆప్ నాయకులు విజయం సాధించారు. ఇక కరెంటును చౌకగా అందించడం  కూడా పెను సవాలే. అదీ సాధ్యమే అని  ఆప్ ప్రభుత్వం నిరూపించింది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం కన్నాలు ఎంచడానికి బీజేపీ నేతలు మీడియా సాయంతో నానా అసభ్యకరమైన పథకాలూ పన్ని నవ్వులపాలయ్యారు. కేజ్రీవాల్ చెప్తున్నది ఒకటే. ప్రపంచంలో  అగ్రభాగాన నిలవడానికి కావాల్సిన అన్ని అవకాశాలూ సంపన్నమైన వనరులూ మన దేశంలో ఉన్నాయి. కేవలం నిజాయితీ నిబద్ధత మాత్రమే లోపం. తమ విజయానికి కారణం సాఫ్  నియత్ అంటే స్వచ్ఛమైన చిత్తశుద్ధి అని ఆయన నొక్కి చెప్తున్నారు. అవినీతి లేని ప్రభుత్వాన్ని అందిస్తే అన్ని పనులూ అవే జరిగిపోతాయి అన్నది కేజ్రీవాల్ నినాదం. ఆ ఒక్కటీ మినహా ఇంకేమైనా సెలవిచ్చుకోండని మన నాయకులు అంటారు. అదే కేజ్రీవాల్‌కీ ఇతర నాయకులకీ తేడా. అందుకే ఢిల్లీలో బీజేపీ కార్యకర్త ఒకరు ‘’కేంద్రంలో మోదీ. ఢిల్లీలో కేజ్రీవాల్’’ అనే పోస్టర్లు వేల కొద్దీ అంటించాడట. బహుశా కేజ్రీవాల్ ముందు మనకు శృంగభంగం తప్పదని ఘనత వహించిన బీజేపీ నేతలే ఈ పనిచేయించినా  ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే దేశానికి మాత్రం మేమే రాజులం అనిపించుకుందామన్న ఆశ కాబోలు. అయితే ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్ సాధించబోతున్న ఘనవిజయం వారి ఆశను ముక్కముక్కలు చేయబోతోందని వారికి తెలియకపోవచ్చు. చూద్దాం. మరోసారి కేజ్రీవాల్ విజయం తప్పదని నమ్ముదాం. ఈ విజయం దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఒక గుణపాఠం కావాలని ఆశిద్దాం. మతం కాదు..జనహితమే అంతిమ విజయానికి హక్కుదారని చాటిద్దాం. కేజ్రీవాల్ ఎన్నికల బరిలోకి దిగినప్పుడు చీపురుకట్ట సూర్యుడు అని ఒక కవిత రాశాను. ఈ దేశంలో సూర్యుడు చీపురు రూపంలో ఉదయించి చీకట్లు ఊడ్చేస్తాడని ఆ కవిత సారాంశం. అది నిజమవుతుందన్న నమ్మకం మదిలో ఏమూలనో వెలుగు నవ్వులు చిమ్ముతోంది.

                 డా.ప్రసాదమూర్తి

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment