సింహం బాత్రూమ్ కి వెళ్లింది .. కోట్లకి కోట్లు కనకవర్షం .. !! 

Share

జర్మనీలో క్రోనే సర్కస్ కంపెనీవాళ్లు కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు సర్కస్ షోలు వెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో డబ్బులు రాకపోవటంతో  సింహాలను పోషించలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో క్రోనే సర్కస్ కంపెనీవాళ్లు వినూత్నంగా ఆలోచించి సింహానికి సంబంధించిన మలాన్ని భారీ ధరకు అమ్ముతున్నారు. సర్కస్ కి చెందిన సింహాలకి, మిగతా జంతువులకి ఆహారం పెట్టలేని పరిస్థితి ఉండటంతో… సర్కస్ నిర్వాహకులు సింహానికి చెందిన మలాన్ని జాడీలో పెట్టి అమ్ముతున్నారు.

Big cats' droppings help German circus weather coronavirus crisis ...దీంతో చాలామంది జనాలు స్నేహితులకు గిఫ్ట్ రూపంలో సింహం బాత్రూం ని కొంటూ జాడీలో పెట్టి ఇస్తున్నారు. ఈ విధంగా జర్మనీలో క్రోనే సర్కస్ కంపెనీవాళ్లు భారీస్థాయిలో డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా జర్మనీ దేశంలో ఉన్న కొంతమంది ఈ సింహపు మల్లం ని ఎరువుగా వాడుతూ… భారీ స్థాయిలో కొంటున్నారు. ఈ సర్కస్ లో 20కిపైగా సింహాలు, పులులు ఉండటంతో.. వాటి బాత్రూమ్ ని ప్రత్యేకంగా పక్కనబెట్టి, జాడీ లో నింపి ఏకంగా ఓ దుకాణం పెట్టి ఈ సర్కస్ నిర్వాహకులు కోట్లకు కోట్లు జర్మనీలో సంపాదిస్తున్నారు.

 

పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు ప్రజల నుండి సింహపు మలం అమ్మితే బ్యాక్టీరియా వస్తుందని….అది  ప్రజారోగ్యానికి పెను ప్రమాదంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కానీ మరోపక్క కేవలం ఇది సర్కస్ లో ఉన్న మూగజీవాలకు ఆహారం అందించడం కోసమే, సింహం మలం విక్రయాలు చేస్తున్నట్లు సర్కస్ నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సింహం మలం అమ్ముతూ కోట్లకి కోట్లు డబ్బు సంపాదించడం ఇప్పుడు జర్మనీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

చాలావరకు జనాలు ఇటువంటివి అసలు ఎంకరేజ్ చేయకూడదని, కరోనా వైరస్ లాంటి మరో కొత్త రోగం పుట్టుకొస్తుందని, తాజా వార్త విని సదరు సర్కస్ సింహం మలం అమ్మే వారిపై విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు.  మరోపక్క జర్మనీ దేశంలో చాలా వరకూ సింహం మలం జాడి ఒకరికి ఒకరు స్నేహితులు బహుమతులుగా ఇచ్చుకోవటం ఒక ట్రెండ్ గా మారింది. దీంతో ఒకవైపు విమర్శలు వస్తున్నా, మరోవైపు మాత్రం సర్కస్ కంపెనీ వాళ్ళకి భారీగా డబ్బులు రావడం విశేషం. 


Share

Related posts

మంచు ఫ్యామిలీని తక్కువంచనా వేశారు.. ఒక్కొక్కరు ఎలాంటి సినిమాతో వస్తున్నారో చూడండి ..!

GRK

సుక్షత్రియుల మాట: ఆర్.ఆర్.ఆర్. అతితెలివైన అజ్ఞానం మస్తిష్కం నుంచి పొంగి పొర్లి పోతుంది!!

CMR

MP Nama Nageswararao: భారీగా నోట్ల కట్టలు..! బ్యాంకులకు “నామా”లు గట్టిగానే పెట్టారు..!!

Srinivas Manem