అనగనగా ఓ రాజు అతని పేరు అక్బర్
అతని కొలువులో తాన్సేన్ అని ఓ సంగీత విద్వాంసుడు ఉండేవాడు
అతను మేఘమల్హార్ రాగం ఆలపిస్తే మేఘాలు కమ్మి వర్షం పడేదిట
అది చరిత్ర
సంగీతానికి రాళ్లు కరుగుతాయిట
ఔను సంగీతానికి ఆ శక్తి ఉంది
శిశుర్వేతి పశుర్వేతి వేత్తి గానం అన్నారు
పసిపిల్లలను భుజమ్మీద వేసుకొని పాట పాడితే నిద్ర పోతారు
అవన్నీ ఒక నాటి మాటలు
సాహిత్యానికి పట్టిన గతే సంగీతానికీ పట్టింది
ఓ బాలమురళీకృష్ణ ఓ శంకరశాస్త్రి ఓ చిట్టిబాబు ఏరీ
వీళ్ళ తరవాత మళ్లీ అంతటి వాళ్ళు వచ్చేరా
ఒక వేళ వస్తే నా అజ్ఞానానికి క్షమించండి
శాస్త్రీయ సంగీతం లేదయ్యా పోనీ సినిమా పాటలు ఇంపుగా ఉంటున్నాయా
ఆ వేళ నేను మా అమ్మ టీవిలో మంచి పాట వింటున్నాం
అభీ న జావో చోడ్కర్ కె దిల్ అభీ భరా నహి అని దేవానంద్ పాడుతున్నాడు
ఎంత చక్కటి సాహిత్యం
నామనసు ఇంకా నిండలేదు అప్పుడే వెళ్ళిపోకు అంటున్నాడు
వింటూ ఉంటె యెంత హాయిగా ఉంది
ఇంతలో మా మనవరాలు వచ్చి ఛానల్ మార్చేసింది ఛీ ముష్టిపాటలు అంటూ
వేర్ డు యు గో అని ఎవరో పాడుతున్నారు
అదండీ ఇప్పటి ట్రెండ్
ఇంగ్లీష్‌లో మాట లాడడం ఇంగ్లీష్ సినిమాలు చూడడం లేటెస్ట్ ట్రెండ్
సాహిత్యం అర్థం ఐతేనే సంగీతం బావుంటుంది
మా మనవరాలు వెళ్లిపోయింది
మా అమ్మ మళ్ళీ ఛానల్ మార్చింది
మనసున మల్లెల మాలలూగెనే పాట వస్తోంది
ఏవైనా
ముసలాయనకి మంచి రొమాంటిక్ సెన్స్ ఉంది
ఎంత సున్నితంగా పిక్చరైజ్ చేసేడు
అలాంటి పాట వింటే మనం ఆలా ఆలా గాలిలో తేలిపోతాం
రొమాన్స్ మానసికం
భార్యా భర్తలైనా ప్రేయసీ ప్రియులైనా ఏకాంతంగా డాబా మీద ఒకరి పక్కన ఒకరు కూర్చోని ఆకాశం ఎగిరే పక్షులు చూస్తూ ఓ మంచిపాట వింటూవుంటే ఎన్ని గంటలైనా గడిచిపోతాయి
కావలింతలు కుమ్ముకోడాలు అక్కర్లేదు
శ్రీపాద వారి రచనలలోనూ మల్లాదివారి రచనలలోనూ ఉన్న రొమాన్సు ఇంకెక్కడా దొరకదు
అదంతా ఓల్డ్ స్కూల్ అంటారు
ఇప్పటివాళ్ళకి సెన్సిటివిటీ లేదు ఫీలింగ్సు లేవు
ఇంతెందుకు పగలంతా ఆఫీసులో చచ్చి చచ్చి వచ్చి ఓ కప్పు కాఫీ తాగి మంచి పాట వింటే
అలసట తగ్గుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది
పల్లెటూళ్ళో ఎప్పుడైనా చూసేరా
నాట్లు వేసే ఆడవాళ్లు పాటలు పాడుతూ నాట్లు వేస్తారు వాళ్ళకి అలసట తెలీదు
రాత్రి పడుకునేముందు మంచి సంగీతం వినండి హాయిగా నిద్ర పడుతుంది
ప్రయత్నించి చూడండి నష్టం లేదు
-బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ