ప్రవాసులంటే నాకు మంట!

క్షమించండి
నాకు ఎందుకో గానీ  పైదేశాల్లో  సెటిల్  ఐనవాళ్ళంటే  అంత  మంచి అభిప్రాయం లేదు
చదువుకోవడానికి ఐతే పరవాలేదు
కానీ వెళ్ళినవాళ్ళు మరి తిరిగిరారు
కారణం డబ్బు.. డాలర్ల మీద మోజు
డాలర్లని  రూపాయల్లో లెక్క వేసుకొని మురిసిపోవడం
నువ్వు ఇక్కడ పుట్టేవు ఇక్కడే పెరిగేవు
ఇక్కడే చదువుకున్నావు ఇక్కడి డబ్బే తిన్నావు
నీ అమ్మ నాన్న తోడపుట్టినవాళ్లు స్నేహితులు ఐనవాళ్లు
అంతా  ఇక్కడే వున్నారు వాళ్ళందర్నీ వదిలి కేవలం డబ్బు కోసం పరాయిదేశం పోతావా
జననీ జన్మభూమి అన్నారు
నీకు ఇద్దరు అక్కర్లేదు
ఏం ఏమాత్రం డబ్బు ఇక్కడ లేదా
మేం విత్తనం నాటి ఎరువు నీరు పోసి పశువులు తినకుండా కాపాడి మొక్కని చేసి పెంచితే
అది పక్కింట్లో కాయలు కాస్తోంది
నువ్వు ఇక్కడి డబ్బుతోనే చదువుకున్నావు
ఆ చదువుతో విదేశాలకి అమ్ముడుపోయేవు
అమ్మకి గుండె జబ్బు నాన్నకి క్యాన్సర్
పాపం నీకు ఏవి అనిపించదు
డబ్బు పంపిస్తావుకదా
నీకు వాళ్ళకి ఉన్నది రక్తసంబంధం డబ్బుసంబంధంకాదు
ఓ రెండెళ్లు ఆర్జించి వచ్చి ఇక్కడే ఏ ఇండస్ట్రీనో పెడితే పదిమంది బతుకుతారు
అక్కడ నువ్వు ఎన్నేళ్లు వున్నా రెండవ తరగతి పౌరుడివే
మనుషులు దూరం ఐతే మనసులు  దూరం అవుతాయి
అక్కడ చదువు వైద్యం రెండు ఖరీదు అందుకే పాపం మనవాళ్ళు ఎన్నారై సీట్లు కేటాయిస్తున్నారు
ఎందుకివ్వాలి.. మనల్ని కాదని పోయినవాళ్ళకి మనం ఇవ్వవలసిన అవసరం లేదు
వాళ్ళు ఇక్కడ చదివి మళ్లీ అక్కడికే పోతారు
ప్రతి ఇంట్లోనూ పెద్దవాళ్ళే వుంటున్నారు
వాళ్ళకి సేవ చేసే దిక్కు లేదు.. సెక్యూరిటీ లేదు
ఐనా  మాకు  బుద్ధి లేదు
మా పిల్లలు అమెరికాలో ఉన్నారని చెప్పుకోవడం గొప్ప
రెండేళ్లకోసారి వచ్చి మొహం చూపించి వెళిపోతారు
ఎవరైనా చస్తే దినానికే రావడం.
అన్నట్టు చెప్పడం మరిచిపోయెను
కొందరు  దానికీ రారు.. మరి డబ్బు ఖర్చుకదా
ఓ మహానుభావుడు తల్లి చచ్చిపోతే తండ్రికి ఫోన్ చేసి..
అమ్మ అంత్యక్రియలు వీడియో తీసి పంపిస్తే ఇక్కడ మా ఫ్రెండ్స్‌కి మన ఆచారాలు చూపిస్తాను అన్నాడు
అప్రాచ్యపు వెధవ అనుకున్నాడు తండ్రి
అలాంటి వాడిని ఏవి చేస్తే పాపం ఉంటుంది
ఒకవేళ ఎవరైనా వస్తే అంత్యక్రియలు అవగానే తల్లినో తండ్రినో ఎవరు మిగిలితే వాళ్ళని హోంలో పడేసి పోతారు
ఉన్న పది పరక తీసుకొని వాళ్ళకి ఉన్నవి అమ్మేసి పోవడం
ఇది రివాజు ఐపోయింది
దీన్ని ఎవరూ ఆపలేరా
ఆపకపోతే కొన్నాళ్ళకి మిగిలేది ముసలివాళ్లే
పిల్లలు అక్కడే వాళ్ళ కులం వాళ్లనే పెళ్లిచేసుకొని ఉండిపోతున్నారు
మరో దేశం వెళ్లినా కులం పిచ్చి వదలదు
ఆ పిల్లలకి అమ్మమ్మ తాతయ్య మేనత్త మేనమామ చుట్టాలు ఎవ్వరూ తెలీదు
ఏ రెండు మూడేళ్లకో వస్తే ఇక్కడ ఇమడలేరు
పోదాం పోదాం అంటారు
పాపం వాళ్ల తప్పేవుంది.. తెలుగు రాదు ఎవ్వరితోను కలవలేరు ఆడలేరు
వీటన్నిటికీ మూల కారణం విదేశీ వ్యామోహం
దీన్ని ఎవరు ఆపలేరా
ఆపరు కొంత జనాభా తగ్గినా మంచిదే ఇది మన మనస్తత్వం
నాలాటి వాళ్ళు యెంత అరిచినా ఒకటే
మన చదువులు మన జనం మనకి పనికిరావడం లేదు
దీన్ని నా లెక్క ప్రకారం దేశద్రోహం అంటాను
మీరేమంటారు

బీనా దేవి