NewsOrbit
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఎన్టీవోడు ఏడీ.. ఎక్కడ?

సెకెండ్ టేక్ :

తండ్రి జీవిత చరిత్రను కుమారుడు తెరకెక్కిస్తే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఇక ఆ కుమారుడే తండ్రి పాత్రను పోషిస్తే? ఆ తండ్రి సినీ నటుడు, పెద్ద హీరో! ఆ పైన రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన మనిషి! Larger than life character! అటువంటి క్యారెక్టర్‌ను కుమారుడు రాగద్వేషాలకు అతీతంగా మలచడం సాధ్యమేనా? కాదు అని కథానాయకుడు సినిమా చూస్తే తెలుస్తుంది. అదేంటి దర్శకుడు క్రిష్ కదా అని అనుకోనక్కరలేదు. స్కీన్‌ప్లేపై బాలకృష్ట ప్రభావం తెలిసిపోతూనే ఉంది.

చిత్రంలో చిన్ని బాలకృష్ణ నామకరణం ఘట్టం ఒకటి ఉంది. ఆ సీను చాలు బాలకృష్ణ ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవడానికి. ఈ సంగతి దృష్టిలో ఉంచుకునే సినిమా మొత్తాన్నీ మనం సమీక్షించుకోవాలి.

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెర కెక్కించడం అంత తేలిక కాదు. ఆయన జీవితం దాదాపుగా తెరచిన పుస్తకం. అటువంటి జీవితంలో ఏయే ఘట్టాలను ఏరి గుది గుచ్చాలో, జీవిత చిత్రణ అసమగ్రంగా లేదన్నఫీలింగ్ (సమగ్రంగా ఉందనే ఫీలింగ్‌ కలిగే విధంగా ఎటూ తీయలేరు) ప్రేక్షకులకు కలగకుండా ఏ విధంగా గుది గుచ్చాలో నిర్ణయించడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటిది. ఈ విషయంలో క్రిష్ ఫెయిల్ అయ్యాడని చెప్పకతప్పదు.

కథానాయకుడు చిత్రాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు: ఎన్టీఆర్ కుటుంబజీవితం, సినీ జీవితం, రాజకీయ జీవితానికి ప్రేరేపించిన నేపధ్యం. రామారావు కుటుంబం మనిషి. ఆయనకు భార్య అన్నా, పిల్లలన్నా చాలా ప్రేమ. ఈ ఫీలింగ్స్‌ను ఈ సినిమాలో చూడలేం. రామారావు, ఆయన సతీమణి బసవతారకం అనుబంధానికి కథానాయకుడులో పెద్ద పీట వేశారని సినిమా విడుదలకు ముందు వినబడింది. సినిమా మాత్రం ఆశాభంగం మిగిలించింది.

హీరో పాత్ర ఎన్.టి.రామారావుది. ఆఖరికి ఆలుమగల అనుబంధం విషయంలోనయినా రొమాన్స్‌కు తావు లేదు. కానీ ఆనుబంధం చూపించాలి, ఎలా? ‘మనిద్దరికీ రెండు ఇష్టాలు ఉంటాయా బావా’ లాంటి పేలవమైన డైలాగులతో ఆ అనుబంధ చిత్రణకు దర్శకుడు ప్రయత్నించాడు. ‘పెళ్లి చేసి చూడు’ సినిమాలోని టైటిల్ సాంగ్ చిత్రణ సన్నివేశం వంటి సందర్భాలను వాడుకునేందుకు ప్రయత్నించాడు కానీ కుదరరలేదు. రామారావు భార్య కాబట్టి బసవతారకం పాత్రను గ్లామరైజ్ చేయాలన్న తాపత్రయంతో అసలు చిక్కు వచ్చి పడింది. ఇద్దరి మధ్యా అనురాగాన్ని హావభావాలతో ప్రకటించే సన్నివేశాన్ని ఒక్కదాన్ని కూడా దర్శకుడు సృష్టించలేకపోయాడు. చివరికి రామారావు కుటుంబ జీవిత చిత్రణలో లైఫ్ లేకుండా పోయింది.

ఇక సినిమా జీవితానికి వస్తే పాతాళభైరవితో స్టార్ హోదా, తర్వాత మాయాబజార్‌తో పౌరాణికాల్లో తిరుగులేని స్థానం, ఆ తర్వాత లేటు వయసులో అడవిరాముడు, యమగోల  వంటి చిత్రాలతో మెప్పించిన వైనం, చివరికి రాజకీయ రంగ ప్రవేశానికి ముందు సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి తరహా రెబల్ పాత్రలు: ఈ దశల చట్రంలో బిగించారు. మొదటి నుంచి చివరి వరకూ రామారావును అత్యున్నత స్థాయిలో నిలబెట్టడం అన్న ఒకే ఒక ప్రాతిపదికతో ఈ చిత్రణ అంతా జరిగింది. నాగిరెడ్డి చక్రపాణిలయినా, బిఎ సుబ్బారావు అయినా, ఆఖరికి కెవి రెడ్డి, ఎల్‌వి ప్రసాద్ పాత్రలు అయినా ఇందుకే తోడ్పడాలి. ఆ క్రమంలో ఆయా పాత్రలకు అన్యాయం జరిగినా సరే!

“రామారావు భార్య కాబట్టి బసవతారకం పాత్రను గ్లామరైజ్ చేయాలన్న తాపత్రయంతో అసలు చిక్కు వచ్చి పడింది. ఇద్దరి మధ్యా అనురాగాన్ని హావభావాలతో ప్రకటించే సన్నివేశాన్ని ఒక్కదాన్ని కూడా దర్శకుడు సృష్టించలేకపోయాడు. చివరికి రామారావు కుటుంబ జీవిత చిత్రణలో లైఫ్ లేకుండా పోయింది.”

ఎన్‌టిఆర్ రాజకీయాల్లోకి వచ్చేందుకు దోహదం చేసిన పరిస్థితులు, ఆయనను అందుకు పురికొల్పిన అంశాల విషయంలో కూడా ఈ తాపత్రయమే కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఫలితంగా చారిత్రక అంశాల విషయంలో దర్శకుడు చాలా స్వేఛ్ఛ తీసుకోవాల్సి వచ్చింది. కల్పనను కాస్త అధిక మోతాదులో జోడించాల్సి వచ్చింది. పద్మశ్రీ పురస్కారం తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ప్రధాని ఇందిరగాంధీతో సంభాషించిన సందర్భం అయినా, దివిసీమ ఉప్పెన బాధితులను పరామర్శించిన సందర్భం అయినా, ఎమర్జెన్సీకి స్పందన సందర్బం అయినా కల్పన మోతాదు మించింది.

మళ్లీ సినిమా జీవితం దగ్గరకు ఒకసారి వెళితే, ఏ హీరో సినీ ప్రస్థానంలో అయినా హీరోయిన్లతో పయనం దశలు ఒక ముఖ్యమైన కోణం. కథానాయకుడు చిత్రం ఆ కోణం జోలికి వెళ్లలేదు. సుదీర్ఘమైన ఎన్‌టిఆర్ సినీ జీవితాన్ని తెరకెక్కించినపుడు అందులో సహ నటీనటులందరికీ చోటు ఇవ్వలేదనడం సబబు కాదేమో కానీ ఎస్‌వి రంగారావు పాత్రను ఒకే ఒక్క డైలాగుకు పరిమితం చేసి ఉండాల్సింది కాదు. మరో లోపం ఘంటసాల పాత్ర లేకపోవడం. ఘంటసాల గాత్రం లేని రామారావు సినిమాలు ఊహించండి, చూద్దాం. స్థూలంగా చూసినా, సూక్ష్మంగా చూసినా సినీ జీవితం చిత్రణ చిక్కగా లేదు.

ఇక రామారావు పాత్ర పోషించిన ఆయన తనయుడు బాలకృష్ణ సంగతి. రామారావు మగవాళ్లే అసూయ పడేంత అందగాడు. అనితర సాధ్యమైన అభినయ కౌశలం ఉన్న నటుడు. ఈ రెండు విషయాలలో కూడా బాలకృష్ట తండ్రికి ఆమడ దూరంలో ఉంటాడు. కానీ రామారావు పాత్రకు అతను తప్ప మరొకరు కుదరరు. రామారావును పోలిన మనిషి బాలకృష్ణను మించి ఎవరు దొరుకుతారు? తండ్రి బాడీ లాంగ్వేజ్ కూడా బాలకృష్ణ చాలావరకూ పట్టుకున్నాడు.

చివరగా, కథానాయకుడు చిత్రంలోని ఒక పెద్ద లోటు గురించి చెప్పాలి. పౌరాణిక పాత్రలు రామారావును ఇంటింటి దేవుడు చేశాయి. అయితే ఆయన చలన చిత్ర ప్రస్థానంలో అది ఒక పార్శ్వం మాత్రమే. ఆనాటి అశేష సినీ అభిమానులు ఆయనలో మరో కోణం కూడా చూశారు. తమతో సమాన స్థాయికి దిగివచ్చి తమకు అవధుల్లేని వినోదం కలిగించే మాస్ హీరోను రామారావులో ఆనాటి ప్రేక్షకులు చూశారు. ఆ హీరోను ప్రేమగా ఎన్టీవోడు అని పిలుచుకున్నారు. ఆ ఎన్టీవోడు ఈ కథానాయకుడులో కనబడడు.

– ఆలపాటి సురేశ్ కుమార్

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

Leave a Comment