ఎటు పోతున్నాం..?ఈ అక్రమ సంబంధాలేంటి??

Share

 

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడితో కూతురుకి ఇచ్చి పెళ్లి చేసిందో మహానుభావురాలు.. కూతురుతో పెళ్లి తర్వాత సైతం అల్లుడు తో సంబంధం నెరిపింది. ఆరు నెలలోనే పసిగట్టిన కూతురు ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. కూతురు బలవన్మరణానికి పాల్పడిన తర్వాత సైతం అల్లుడుతో సంబంధం కొనసాగించిన ఆమె చివరకు రోజు తనను విసిగించి, వేధిస్తున్నాడని చివరకు అల్లుడిని చంపేసింది. ఇది శుక్రవారం హైదరాబాద్ లో వెలుగు చూసిన దారుణం.
కేవలం ఇది టీజర్ మాత్రమే. సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలకు ఇది చాలా చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి విషయాలు బయటకు వస్తే గానీ, నేరాలు జరిగిన సందర్భాల్లో గాని వాటి స్వభావం, నైతికత అర్థం కావు. దాదాపు సమాజంలో సెక్స్ కోసం అడ్డదారులు తొక్కడం ఒక ఎత్తయితే, వావి వరసలు వదిలి సెక్స్ కోసం పాకులాడటం ఎక్కువ అవుతోంది. దీనికి మనం స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, ఇష్టాలు, సెల్ఫ్ భావాలు అని నానా రకాల పేర్లు పెట్టుకున్నా భారతీయ సంస్కృతికి ఇవి సమాధి కడుతున్నాయి. * చిత్తూరు జిల్లా పలమనేరు కు చెందిన ఓ జంట ఇటీవల పెళ్లి చేసుకుని వచ్చారు యువతీయువకులకు నిండా 23 ఏళ్లు నిండలేదు. వారు వరసకు అన్న చెల్లెలు. ఎంతో చనువుగా ఉంటారని కుటుంబ సభ్యులు గమనించిన వారు ఈ తరహా చదువు అనుకోక పోవడం తో ఆ జంట గుడి లో రహస్యంగా పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు.

* బెంగళూరుకు చెందిన ఒంటరి మహిళ తన 20 ఏళ్ల కొడుకుతో పాటు ఉంటోంది. కొడుకు యుక్త వయసు దగ్గరనుంచి అతడితో సెక్స్ చేస్తున్న ఆ మహిళ పెడ ఎక్కువ కావడంతో కొడుకు స్వయంగా కంప్లైంట్ ఇవ్వడం సంచలనం అయ్యింది.

* వరసకు పిన్ని వయసు అయ్యే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కావలికి చెందిన ఓ యువకుడు. పెళ్లి తరువాత దానిని కొనసాగించడం వారికి తెలుసుకోవడంతో అది పోలీస్ స్టేషన్ మెట్లు వరకు ఎక్కింది.

* కళ్ళలో పెట్టుకుని కూతురిని చూడాల్సిన తండ్రి 14 ఏళ్ల బాలికపై నిత్యం లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడటం ఎవరు స్థానికుల సహాయంతో పోలీస్ స్టేషన్ కడప వరకు వెళ్లడం వైజాగ్ లో జరిగిన ఘటన.

విశృంఖల పోకడ

గతంలో పాశ్చాత్య దేశాల్లోనే కనిపించే ఈ పోకడ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎక్కువవుతోంది. వావివరుసలు మరిచి కేవలం పడక సుఖం కోసం బంధాలకు చెల్లుచీటీ రాసే ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. మనిషి మెదడు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో, సులభంగా ఒకరినొకరు కలుసుకుంనెందుకు అవకాశం ఏర్పడుతుందో అప్పుడు విశృంఖలత్వం పెరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే. చేతిలో సెల్ఫోన్ పుణ్యమా అని సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని బయటికి వెళ్లేందుకు తన కనీస అవసరాలు తీర్చుకునేందుకు లేదు. ఇంట్లోకి అన్ని వచ్చేస్తున్నాయి. అలాగే మనిషి సగటు సంపాదన ఎక్కువ అయింది. మరోపక్క సెల్ ఫోన్ మనిషిని మరింత దగ్గర చేసింది. జాతీయ నేర గణాంకాల చెప్పిన దాని ప్రకారం దేశంలో 74 శాతం హత్యల్లో సెక్స్ వల్ సంబంధాలు కలిగి ఉన్నవే. దీనిలోనూ దేశంలో మానవ సంబంధాలు మరిచి జరుగుతున్న హత్యలు దాదాపు ఆరు శాతం గత మూడేళ్ళలో పెరిగినట్లు నివేదిక ఇచ్చింది.

స్వాతంత్రత ఎక్కువైనా ప్రమాదమే!!

అధిక నిర్బంధం ఎంత ప్రమాదమో మితిమీరిన స్వేచ్ఛ అంటే ప్రమాదం. ప్రస్తుత తరంలో జరుగుతున్నది అదే. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన మిలీనియల్స్ జనరేషన్ నేడు విశృంఖల స్వేచ్ఛను అనుభవిస్తోంది. వారిని తల్లిదండ్రుల కొట్టినా తిట్టినా ఒక మాట అన్న పడే పరిస్థితి లేదు. చిన్నప్పటినుంచి హెలికాప్టర్ పెయింటింగ్ కు అలవాటుపడుతున్న నేటి యువత చిన్న చిన్న విషయాలకే పెడదారులు పడుతున్నారు. చేతిలోని సెల్ఫోన్ విచ్చలవిడిగా వినియోగిస్తూ నీలి చిత్రాలను చూస్తున్నారు. దాని వల్ల వచ్చే కోరికలను అదుపులో ఉంచుకోలేక రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇటీవల ఓ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో 9 ఏళ్లకే నీలి చిత్రాలు చూసే పరిస్థితి దేశంలో కనిపించి నట్లు తెలిసింది. అలాగే వావివరుసలు మరచి సెక్స్ కోసం పరితపించే యువత మానసిక కేంద్రాలకు ఎక్కువగా వస్తున్నట్లు ఏపీ సైకలాజికల్ అసోసియేషన్ తన పత్రికలో పేర్కొంది. ఇదే పెడ ధోరణి మెల్లమెల్లగా సమాజంలోకి వేలూరు ఉంటే ఇక చివరకు బంధాలు బంధుత్వాలు మర్చిపో వలసిందే.


Share

Related posts

Telugu desam Party: టీడీపీలో మార్పులు జరుగుతున్నాయా..? యువతరం వస్తోందా..!?

Muraliak

Karnataka : జార్కి హోలీ కి రంగులు : ఆసక్తి గా కర్ణాటక రాజకీయం!

Comrade CHE

ఏమిటి ? గార”డి”… ఈ తాత్కాలిక పట్టాలేలా జగన్ ??

Comrade CHE