NewsOrbit
వ్యాఖ్య

మనవాళ్ళు  మహానుభావులు!

ఎంతైనా మనవాళ్ళు  మహానుభావులు
ముఖ్యంగా మన మధ్య తరగతి బుద్ధి జీవులు!!
2019 లో దేశం ఆర్ధిక సమస్యలతో అట్టుడికినట్టు ఉడికిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అనునిత్యం పెరుగుతూ పోయాయి. ఆర్థికాభివృద్ధి మాత్రం చీమనడక సాగిస్తూ వచ్చింది. ఆర్ధిక రంగం అట్టడుగు మట్టిని ముట్టి, అక్కడే పొర్లుతోంది.
ద్రవ్యోల్బణం మన వంటిళ్లను చుట్టుముట్టింది. తల్లి చేసే మేలును మించినంతగా మేలు చేస్తుందని చెప్పే ఉల్లి, బీదా బిక్కి నడ్డి విరగగొట్టింది. ఆకుకూరలూ, కూరగాయల ధరలు కూడా అటకెక్కి కూర్చున్నాయి.
ఇక సామాజిక రంగం మరింత దరిద్రంగా తయారయింది. ఎన్నడూ లేనంత ప్రమాణంలో నేరాలూ, ఘోరాలూ పెచ్చరిల్లిపోయాయి. అధికారిక హత్యాకాండను తెగబడి స్వాగతించే సిగ్గుమాలిన నేతలు వీథికి ఒకరు తయారయ్యారు. ఒకానొక వామపక్ష అగ్రనేత ఈ అధికారిక హత్యాకాండను తెగించి స్వాగతించడం ఒక యెత్తు – వాళ్ళ పార్టీ ఇటువంటి హత్యాకాండను వ్యతిరేకించాలని ఎప్పుడో తీర్మానించిందని చెప్తూ అంచేత జాతికి క్షమాపణ నివేదించుకోవడం ఇంకో ఎత్తు.
వైజ్ఞానిక రంగంలో ఒక పెద్ద వైఫల్యం ఎదురైనప్పటికీ, అంతరిక్షంలో “రాజ్యం” మూడో కంటిని విప్పార్చి మన వైజ్ఞానికులు మీసం మెలితిప్పారు.
దశాబ్దాలుగా అపరిష్కృతంగా నలుగుతూన్న బాబరీ మసీదు వివాదం విషయంలో పిసుక్కుని పిసుక్కుని చివరికి సర్వోన్నత న్యాయస్థానం ఏదో తీర్పు చెప్పింది. ఆ లోగానే అమిత్ ఉత్సాహంతో ప్రభుత్వం “పౌరసత్వ సవరణ బిల్లు” తెచ్చిపడేసింది. దాని పుణ్యమా అని అషోమ్ మొదలుకుని ఈశాన్య రాష్ట్రాలన్నీ తగలబడి పోతున్నాయి. దక్షిణాన కేరళ భగ్గుమంటోంది.
ఇక సాంస్కృతిక రంగం సంగతి చెప్పనవసరం లేదు. తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలను తొలుచుకుని పోతూనే వున్నారు మన సాంస్కృతికులు. ప్రపంచం ఎటు పోతుందనే స్పృహ ఏ కోశానా లేని ఈ సాంస్కృతికులు జాతి ఎదుర్కునే అత్యంత క్లిష్టమైన సమస్యలకు -ముఖ్యంగా నైతిక సమస్యలకు- చిట్కా వైద్యం చేస్తూ పోతున్నారు. ఇక మన ఆధ్యాత్మిక రంగధాములు సకల ధార్మిక నైతిక నైష్ఠిక సమస్యలతో పాటు రేప్ లాంటి సమస్యలకు కూడా బైరాగి చిట్కాలు సూచిస్తూనే వున్నారు. ఇది మనలో ప్రతి ఒక్కరం ప్రతి క్షణం చూస్తున్న దృశ్యమే!
అయితే, చిత్రం ఎక్కడుందంటే, మన మధ్యతరగతి బుద్ధిజీవులు ఈ ముఖ్యమైన విషయాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదేదో నాలిక చివరినుంచి విసురుతున్న విమర్శ కాదు. సాక్షాత్తూ గూగుల్ బయటపెట్టిన నిజం.
2019 లో మన నెటిజెన్ల దృష్టిని అపారంగా ఆకర్షించిన మొదటి అంశం ఐసీసీ వరల్డ్ కప్ పోటీ. మన దేశంలో క్రికెట్ ఒకప్పుడు స్టేటస్ సింబల్‌గా ఉండేది. క్రమంగా అది దేశభక్తికి గీటురాయిగా ప్రమోషన్ సాధించుకుంది. ఇప్పుడు క్రికెట్ గురించి తెలియని వాడు అనాగరికుడూ, నిరక్షర కుక్షీ అనే బిరుదులూ -ఉచితంగానే- సంపాదిస్తున్నాడు.
అలాంటి క్రికెట్ తర్వాతి స్థానంలోనే లోక్‌సభ ఎన్నికలు -తలవంచుకుని- నిలబడ్డాయి. మోడీ రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన ఈ ఎన్నికల విషయంలో మన మధ్యతరగతి మందభాగ్యులకు ఏ పాటి ఆసక్తి ఉండిందో గూగుల్ స్వయంగా బయటపెట్టింది.
నోబెల్ పురస్కార గ్రహీత “వెంకీ” లాంటి అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తనే  అద్భుత వైజ్ఞానిక పరిజ్ఞానంతో అదరగొట్టిన మన ప్రధానమంత్రి స్వయంగా శ్రీహరికోట వెళ్లి, దగ్గరుండి మరీ పంపించిన చంద్రయాన్-2 (విఫల) ప్రయోగం ఆ తర్వాత -మూడో- స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. అణువణువునా నెగటివిటీ నింపుకున్న మన నెటిజెన్ల దృష్టిని చంద్రయాన్ 2 వైఫల్యం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
వివాదాస్పదమైన బాలీవుడ్ సినిమా కబీర్‌సింగ్ నెటిజెన్ల దృష్టిని ఆకర్షించిన అంశాల జాబితాలో నాలుగో స్థానం దక్కించుకుంది. నిజానికి మన జాతికి తెలిసిన ఏకైక వినోదసాధనం, కళారూపం సినిమాయే కనక ఈ అంశం ప్రథమ స్థానం దక్కించుకుని వున్నా పెద్దగా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు!
యాంథోనీ రూసో, జో రూసో దర్శకత్వంలో వెలువడిన అమెరికన్ సూపర్ హీరో ఫిలిం అవెంజర్స్:ఎండ్ గేమ్ ఐదో స్థానంలో నిలబడగలిగింది. పైకి దేశభక్తి ఎంత నటించినా మన మధ్యతరగతి బుద్ధిజీవులు అంతరాంతరాల్లో విదేశ భక్తులేనని తరతరాలుగా రుజువవుతూ వస్తూన్న విషయమే. వాస్తవానికి ఈ మధ్యతరగతి బుద్ధిజీవులు పాశ్చాత్య ధనస్వామ్యానికి దాసోహం చేసే శక్తులు. మన పురాణాల్లో కుబేరుడిని నరవాహనుడు అన్నారు. నడిమి తరగతి నరవాహనుడని ఆధునిక సందర్భంలో అనుకున్నా తప్పేం లేదు!

దిశ కేసులో చొక్కాలు చింపుకున్న ద్వేషభక్తులు ఆ కేసుకు సంబంధించిన వివరాలు -నెట్లో- ఫాలో కావడంలో మాత్రం అంత శ్రద్ధ చూపించలేదు. అలాంటి విషయాలపై శ్రద్ధ చూపినందువల్ల తమకు ఏమైనా లాభం ఉంటుందని అనిపించిన పక్షంలో ఈ మధ్యతరగతి బుద్ధిజీవులు దిశ పై ప్రేమాభిమానాలు కుమ్మరించి ఉండేవారు. కనీసం గొప్ప ప్రచారం దక్కుతుందనే భరోసా అయినా ఉంటే వీళ్ళు తెగ రెచ్చిపోయేవారు. అధికారిక హత్యాకాండకు దక్కినంత ప్రాచుర్యం దిశ మాదిరిగా అన్యాయమయిపోయే అమాయకురాళ్లకు దక్కలేదు. ఇలాంటి విషాదాలు పునః పునః జరక్కుండా చెయ్యడానికి తీసుకోవలసిన చర్యల విషయంలో మన నడిమి తరగతికి ఏపాటి చైతన్యం ఉందో ఈ సందర్భంగా రుజువయ్యింది.

నిజాయితీగా ఈ కేసు సందర్భంగా స్పందించింది లోకం తెలియని నవ యువతీ యువకులే! నాలుగేళ్లు గడిచాకా -కాస్త చిరు బొజ్జ పెంచిన తర్వాత- నాలుగు ఉంగరాలూ, రెండు గొలుసులు ధరించడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళ మనస్తత్వం, తత్వం కూడా మారుతుంది. “ఈ లోకం మనం కోరుకున్నట్టు ఎలాగూ మారదు –  మనమే దానికి తగినట్టు మారిపోతే పోలా?!” అనుకోగలిగిన పరిపక్వత సాధించేసరికి అచ్చమైన మధ్యతరగతి తోకకప్పలుగా తర్ఫీదు పూర్తవుతుంది! అప్పుడు వీళ్ళు కూడా క్రికెట్టూ, సినిమాలూ, పిల్లితల్లికి కుక్కపిల్ల పుట్టడం, పంది దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యడం లాంటి విషయాలను గూగుల్ లో సెర్చ్ చెయ్యడం మొదలెడతారు!

 

-మందలపర్తి కిషోర్

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment