NewsOrbit
వ్యాఖ్య

వర్ధిల్లు గాక!

సర్వ శక్తిమంతుడవైన ఓ మహా ప్రభూ

మహాశయా..నమో నమ:

నీవు ఆకాంక్షించినట్టే జనత నడిచినది

నీ కరుణారుణ రౌద్ర వీక్షణాల నీడలో ప్రజాస్వామ్యము పరిమళించినది

పుల్వామా ఎవరి పుణ్యమో అది నీకు ఓట్ల పంటగా పరిణమించినది

బాలాకోట్‌లో ఏమి జరిగెనో అది నీ విజయ దుర్గమునకు మార్గమైనది

రహస్యము..రహస్యము..ప్రశ్నించుట పాపము..సందేహించుట ద్రోహము

పక్షులో పాములో ప్రజలో సర్వ జీవకోటికీ దేశభక్తిని నూరిపోసిన ధన్యుడవు నీవు

భయపెట్టితివో..భ్రమపెట్టితివో..దేశం నీ అడుగుల కింద ముడుచుకుని శయనించినది

మహా మహిమాన్వితుడవైన ఓ మహోన్నత నేతా

మా రాజ్యానికి మా సరిహద్దులకు అంతర్ బహిర్ భద్రతా పరిరక్షణకు

ఏకైక సంరక్షకుడవు నీవే అని హృదయపూర్వకముగా విశ్వసించుచున్నాము

పదవీ మోహమే తప్ప దేశ క్షేమం కోసం ఏకం కాలేమని తేల్చి చెప్పిన విపక్షాల కంటే

నీ చూపుడు వేలు పట్టుకుని వేలాడడమే మేలని తలచుచున్నాము స్వామీ

ముక్కల ముక్కల ఎర్ర జెండాలు ఎగిరిపోతుంటే దిక్కలేక కమల దళాలను ఆశ్రయించిన

ఆశయ శ్రేణుల అంతర్మథన అసహాయ కల్లోలాలను అర్థం చేసుకొనుచున్నాము తండ్రీ

ఇక నీవు ఎటుల చెప్పిన అటులనే నడుచుకొందుము నాయనా

ఆవును పూజించి మనిషిని ద్వేషించుట పరమ పవిత్రమైన ధర్మముగా భావించుకొందుము

గో మూత్రమును మించిన ఔషధము ఏ మాత్రము లేదని ప్రకటించుచున్నాము తండ్రీ

నీ మతమే దేశాభిమతముగా అంగీకరించెదము

ఎదురు తిరిగిన శిరచ్ఛేదమో..చెరసాలల గమ్య స్థానమో  తప్పదని ఒప్పుకొందుము

తలలెత్తిన అవి కటకటాలకు వేలాడదీయబడునని నిజముగా నిర్ధారించుకొందుము

ఏ ఉగ్రవాదమైనా మీ మహోగ్రవాదము ముందు బలాదూరన్న ఎరుకతో మసలుకొందుము

నీ భజన తప్ప మరే కీర్తనలూ చేయమని వాగ్దానించుచున్నాము

పద్మ దళములతో అల్లిన నీ గొడుగు కింద అఖండ భారతమూ సేద తీరునని త్రికరణ శుద్ధిగా నమ్మెదము

వర్ధిల్లు గాక  వర్ధిల్లు గాక.. దేశం వర్ధిల్లు గాక

భిన్న జాతుల భిన్నమతాల భిన్న భాషల భిన్న సంస్కృతుల సకల వర్ణాలు ఒకే ఒక కాషాయ వర్ణమై శోభిల్లు గాక

అబద్ధమూ నిజమూ ఏకమై

అజ్ఞానములో విజ్ఞానము లీనమై

అక్షరాలు..ఆలోచనలు మోయలేని తాళం కప్పలు మోసుకుంటూ నోరు మూసుకుంటూ దేశమంతా తిరుగు గాక

సంకెళ్ళ సంగీతంతో కళలూ కలలూ వినోదించు గాక

యోగులతో సాధ్వీమణులతో రాజ్యము విరాజిల్లు గాక

సర్వ శక్తి సంపన్నుడవైన ఓ పాలకా

నీవు కోరిన రాజ్యమే వచ్చినది..నీ స్వప్నమే ఫలించినది

ఇక నీ కోరికే దేశం కోరిక..నీ కలే దేశం కల..

నీ ఆదేశమే మా ఆదర్శము

ఇక నీ శత్రువులందరూ జీవన్మృతులే

నీవూ నీ మిత్రులూ నీ శిష్యులూ నీ స్వాములు నీ యోగులూ దేశమంతా వ్యాపింతురు గాక

యుద్ధమూ శాంతి..ద్వేషమూ ప్రేమా అంతా మీ ఆజ్ఞానుసారమే జరుగును గాక

అధికారులు..కోర్టులు..రాజ్యాంగము..ఎన్నికలు..ఓటింగు యంత్రాలు..బ్యాంకులు..నోట్లు..

అన్నీ మీ కనుసన్నలలో మెలగు గాక..

ఇక మీ దయ నాయనా

జనులు జీవించుటకైనా..మరణించుటకైనా

మరణిస్తూ జీవించుటకైనా జీవిస్తూ మరణించుటకైనా

అంతా తమ రాజ్యము..తమ అభీష్టము..

ముంచిననూ తేల్చిననూ అంతా తమ కరుణ..తమ కటాక్ష

నిస్సహాయులము నీ మ్రోలబడి ప్రార్థించుచున్నాము

సర్వ రక్షకుడా దేవా ప్రభూ!

-డా.ప్రసాదమూర్తి

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment