NewsOrbit
వ్యాఖ్య

సంస్కారం  ఏదీ!?

కన్యాశుల్కం  వయస్సు  యెంత
ఆమధ్యనే  నూరేళ్లు  నిండేయి
అప్పుడు  ప్రతి  ఇంట్లోనూ  గంగాభగీరథీ  సమానులుగిరీశం  భాషలో బ్యూటిఫుల్  యంగ్  విడోస్ ఉండేవారు
వాళ్ళు  ఏంచేసేవారు
పుట్టింట్లో అప్పడాలో వొడియాలో అవకాయో పెట్టడం పురుళ్ళు పొయ్యడం  అంతే
తీరికవుంటే  ఆధ్యాత్మ రామాయణ  కీర్తనలు పాడుకోవడం
మోటుగా  చెప్పాలంటే  వీళ్ళు  ఆడవాళ్ళలో  అంటరానివాళ్ళు
వాళ్ళు  చేసిన  పాపం  ఏవిటి
అర్థాయూష్  గాడిని  కట్టుకోవడం
మన  దిక్కుమాలిన  శాస్త్రాల  ప్రకారం  వీళ్ళు  జుత్తు  ఉంటె  మడికి  పనికిరారు
మరంచేత  జుత్తు  తీసేయ్
జుత్తే  లేనప్పుడు  పువ్వులెందుకు  తీసేయ్
మన  శాస్త్రాలకి  బుద్ధి,  బుర్ర, అబుర్రలో  ఆలోచన లేవు
మంచి బట్టలు పువ్వులు బొట్టు  కాటుక  ఉంటె  మొగాడిని  ఆకర్షిస్తుందిట
సింగినాదం కాదూ
మొగాడికి  కావలసింది  బొట్టు పువ్వులు వగైరా  కావు
కేవలం  ఓ ఆడది  అంతే
తలలు  బోడులైనా  తలపులు  బోడులా  అన్నాడు  వేమన
అందుకే ఆరోజుల్లో అప్పుడప్పుడు నూతిలోనో చెరువులోనో ఆడ శవాలు  తేలేవి
వంద  ఏళ్లలో  చాలా  మార్పు వచ్చింది
మనం  మోడర్న్  అయిపొయేం, శుభం
పైటలు  పారేసేం
ప్యాంటు  షర్ట్  వేస్తున్నాం
చదువుతున్నాం, ఉద్యోగాలు  చేస్తున్నాం
ఐతే  ఈ  అభివృద్ధి  వాపేకాని  బలుపు  కాదు
మన  మనసులు ఇంకా  కన్యాశుల్కం  దగ్గరే  ఉన్నాయి
ఓ చిన్న  ఉదాహరణ
ఆమధ్య  నేను  మా అమ్మాయి  ఒక  ఫ్రెండ్ ఇంటికి  వెళ్ళేం
ఆ  ఫ్రెండ్  ఫెమినిస్ట్
ఆవిడ  మాఅమ్మాయికి  బొట్టు  పెట్టింది.
నాకు  పెట్టలేదు
ఆ కుంకం  తీసుకోని  నేనే పెట్టుకుందావఁన్నత  ఆవేశం  వచ్చిది
కానీ ఆపుకున్నాను
యేవిఁపాపం  చేసేనని  నాకీ  అవమానం
అందుకే  నరసింగరావు  పోయేక  నేను  ఏ ఫంక్షన్లకి  వెళ్లడం మానేసేను
అతను  ఉన్నన్నాళ్ళు  నేను  శుభశకునం,  నా హస్తవాసి  మంచిది
అతను  పోయిన  మరు క్షణం  నేను  అశుభం
అంటే  నాలో  ఉన్న  శుభాన్ని  అతను  పట్టుకుపోయేడా
యెంత  దరిద్రపు ఆచారం
ఎవరైనా  బైటికి  వెళ్తున్నప్పుడు  పిల్లి  ఎదురైతే  అశుభం
నల్లపిల్లి ఐతే  పర్వాలేదు
నేను ఆ  నల్లపిల్లిపాటి చెయ్యకపోయెనా
ఈ  అచారాలన్నీ పాటించేది  ఆడవాళ్లే
ఈ చదువులు  ఉద్యోగాలు  కేవలం  డబ్బుకోసమే
సంస్కారం ఇవ్వలేదు
అమెరికా,  ఆఫ్రికా వెళ్లడం అభివృద్ధి  కాదు
విత్  ఆర్  వితౌట్ మొగుడు అందరు ఆడవాళ్లు  సమానమే అనుకున్నపుడు అదీ  అభివృద్ధి
ఆడదాన్ని  అవమానించడం సృష్టికే  అవమానం
ముందు సంస్కారం  నేర్చుకోండి

బీనా దేవి

author avatar
Siva Prasad

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment