మొక్కుబడి సమావేశాలకు జనసేన రాదు

అమరావతి, జనవరి 29: మొక్కుబడి సమావేశాలకు జనసేన దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాన్ పేర్కొన్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ లేఖ రాశారు.

టిడిపి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం బుధవారం వివిధ రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం తలపెట్టింది.

బుధవారం సమావేశం ఏర్పాటు చేసి మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడాన్ని పవన్ తప్పుబట్టారు. తగిన సమయం ఇవ్వకుండా, పూర్తి స్థాయి ఎజండా నిర్ణయించకుండా ఈ సమావేశం కేవలం మొక్కబడిగా గోచరిస్తుందని పవన్ అన్నారు.

ఈ సమావేశానికి తమ పార్టీ దూరంగా ఉంటుందని పేర్కొన్నారు.