రాజకీయాల్లోకి అడుగు

88 views

బెంగళూరు జనవరి1 : నూతన సంవత్సరంలో  విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన రాజకీయ అరంగేటరాన్ని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి తాను స్వత్రంత్ర అభ్యర్థిగా భరిలో ఉంటానని సోమవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  మీ అందరి సహాకారంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా పోటీ చేస్తానని తెలిపారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబొయే అంశాన్ని త్వరలో తెలియజేస్తానని ట్వీట్‌ చేశారు.

పలు అంశాల్లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రకాశ్‌ రాజ్‌ గత కొద్ది రోజులుగా త్రీవ్ర స్ధాయిలో  విమర్శలు చేస్తున్నారు. తన స్నేహితురాలైన కన్నడ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యా జరిగింది. గౌరీ లంకేశ్‌ హత్య వెనుక హిందుత్వ వాదుల హస్తం ఉందనే ఆరోపణలున్న ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రకాశ్ రాజ్ తన విమర్శలకు మరింత పెంచారు.

ప్రకాశ్‌ రాజ్‌ రాజకీయ ప్రస్ధానం గురించి ట్విటర్‌లో తెలుపగానే చాల మంది సానుకూలంగా స్పందించారు. ప్రకాశ్‌రాజ్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మద్దతుగా  రీ ట్వీట్లు చేశారు. పోస్ట్‌ చేసిన గంటలోపే దాదాపు వెయ్యి లైక్‌లు వచ్చాయి.

గత కొద్ది కాలంగా మోదీ ప్రభుత్వం పై ఆయన నీర్ణయాలపై హిందుత్వ వాదులు చేస్తున్న మరాణ కాండ పై ప్రకాశ్ రాజ్ పత్రికలు, టివిలు,సామాజికమాద్యమాల ద్వార త్రీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటి వరకు ఒక సామన్య నటుడుగా ప్రకాశ్ రాజ్ బీజేపీ పై విమర్శలు సందించారు. ఆయన రాజకీయ రంగప్రవేశం అనటంతో ప్రకాశ్ రాజ్ బీజేపీ శ్రేణుల మద్య వార్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు బీజేపీ నేతలు నటుడిగా ఉన్నారు కాబట్టి పెద్దగా పట్టించు కొలేదు. ప్రకాశ్ రాజకీయ ప్రవేశంతో బీజేపీ ఎటువంటి విమర్శలు చెస్తోందో చూడాలి.