NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

2024 Elections: వామ్మో..! పార్లమెంట్ స్థానాల పెంపు షురూ..! 2024 టార్గెట్ గా బీజేపీ భారీ వ్యూహం..!!

PK Strategy: KCR, Kodali in Part of PK Plan..?

2024 Elections:  కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని హస్తగతం చేసుకున్న బీజేపీ 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించి హాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. వారికి ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది. ఈ క్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఒకే ఎన్నికల అంటూ జమిలి తీసుకురావాలని తొలుత ప్రయత్నాలు మొదలు పెట్టగా అది లాకమిషన్ పరిశీలన దశలో ఉంది. అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2024 నాటికి జమిలి ఎన్నికలు సాధ్యం కాదని తెలుసుకున్న బీజేపీ..దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలు పెంచాలి అన్న సంచలన నిర్ణయానికి వచ్చింది. వారు అనుకున్నదే తడవుగా పార్లమెంట్ స్థానాల పెంపుపై ఓ ప్రతిపాదన తీసుకువచ్చి నేడు పార్లమెంట్ లో చర్చకు ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదనతో ఏయే రాష్ట్రాల్లో ఎన్ని పార్లమెంట్ స్థానాలు పెరగనున్నాయి తదితర అంశాలపై రెండు మూడు రోజుల్లో పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై పార్లమెంట్ లో చర్చ అనంతరం అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పార్లమెంట్ స్థానాల పెంపుపై చర్చించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా టూ థర్డ్ రాష్ట్రాల్లో ఆమోదం తెలిపితే పార్లమెంట్ స్థానాల పెంపు అయిపోతుంది. ఆ తరువాత లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం లాంఛన ప్రాయమే అవుతుంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం ఉండగా మరో అయిదు రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాల పెంపుపై ఆమోదం తెలిపితే ఇది జరిగిపోతుంది.

2024 Elections: BJP New Plan 1200 MP Seats
2024 Elections BJP New Plan 1200 MP Seats

2024 Elections: రాష్ట్రాల వారీగా పెంపు లెక్క ఇలా..!?

బీజేపీ చెబితే తలాడించే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు ఉండటం వల్ల ఇది పెద్ద కష్టమేమీ కాదు. సో..2024 ఎన్నికల నాటికి పార్లమెంట్ స్థానాల పెంపు ఖాయం అయినట్లే. రాష్ట్రాల వారిగా పెరిగే స్థానాలు చూసుకుంటే ..ఏపిలో ప్రస్తుతం 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా వాటిని 52 చేయాలను కుంటున్నారు. కొత్తగా పెరిగేవి 27 స్థానాలు. అలాగే అస్సాంలో 14 నుండి 29, బీహార్ లో 40 నుండి 94, చత్తీస్‌ఘడ్ లో 11 నుండి 25, గుజరాజ్ లో 26 నుండి 60, హర్యానాలో 10 నుండి 24, జార్ఘండ్ లో 14 నుండి 30, కర్ణాటకలో 28 నుండి 67, కేరళలో 20 నుండి 35, మధ్యప్రదేశ్ లో 29 నుండి 68, మహారాష్ట్రలో 48 నుండి 117, ఒడిశాలో 21 నుండి 43 చేయాలని ప్రతిపాదన, పంజాబ్ లో 13 నుండి 28, రాజస్థాన్ లో 25 నుండి 65, తమిళనాడులో 39 నుండి 77, యూపిలో 80 నుండి 193, పశ్చిమ బెంగాల్ లో 42 నుండి 92, తెలంగాణలో 17 నుండి 39 పార్లమెంట్ స్థానాల పెంచాలని ప్రతిపాదించారు. ఇలా పలు రాష్ట్రాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ స్థానాలకు ప్రతిపాదనలు చేయడం గమనార్హం. ఒకటి రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న చిన్న చిన్న రాష్ట్రాల్లో పెంపు ప్రతిపాదన చేయలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 543 పార్లమెంట్ స్థానాలను 1200 పార్లమెంట్ స్థానాలుగా పెంచాలనేది కేంద్రం యోచన. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర 140 శాతం కంటే ఎక్కువగా సీట్లు పెరుగుతున్నాయి.

2024 Elections: BJP New Plan 1200 MP Seats
2024 Elections BJP New Plan 1200 MP Seats

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు కూడా..!?

ఇక్కడ మరొక విషయం గమనించాలి. పార్లమెంట్ స్థానాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అయితే అదే సవరణ ప్రకారం అసెంబ్లీ స్థానాలను పెంచుతారు. ఏపి, తెలంగాణలో విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానాల పెంపు ఉంది. ఈ ప్రకారం ఏపి, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏపిలో 175 నుండి 225 స్థానాలకు, తెలంగాణలో 119 నుండి 175 అసెంబ్లీ స్థానాలు చేయాలన్నది ఒక ప్రతిపాదన. సో.. ఒక వేళ అసెంబ్లీ స్థానాల పెంపు అనేది జరిగితే అధికారంలో ఉన్న పార్టికి అనుకూలతగా మారుతుంది. అయితే ఏపిలో మాత్రం అసెంబ్లీ స్థానాల పెంపు జరిగితే అది టీడీపీ లాభం కలుగుతుందన్న భావనలో వైసీపీ ఉంది. ఏపిలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే వైసీపీ ఎందుకు నష్టం జరుగుతుంది? టీడీపీ లాభ పడేందుకు అవకాశం ఎందుకు ఉంటుంది? వైసీపీ ఎందుకు భయపడుతుంది? అనే విషయాలు మరో కథనంలో వివరణాత్మకంగా అందిస్తాం.

author avatar
Srinivas Manem

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju