NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

“ఆ నలుగురు” రాజీనామా చేస్తే..!! ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి..?

YSRCP: Another MP turned as Rebal

టీడీపీని వీడి అనధికారికంగా వైసీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ముగ్గురు సిద్ధమే అంటూ వైసీపీ వర్గాల్లో పుకార్లు వస్తున్నాయి. అంటే ఇప్పటికే 19 కి పడిపోయిన టీడీపీ బలాన్ని 16 కో, 15 కో పరిమితం చేయాలన్నది వైసీపీ వ్యూహం. అది ఎంతో దూరంలో లేదు. అయితే వైసిపిలో చేరిన వారిలో ఎంత మంది ఆ పార్టీలో ఎదగగలరు..? జగన్ నమ్మకాన్ని గెలుచుకోగలరు అనేది ముఖ్యం..!!

రాజీనామాకు ఎవరెవరు సిద్ధం..?

వైసిపిలో చేరినా ఆ పార్టీలో మొహమాటంతోనే ఉండాలి. సరైన గుర్తింపు.., జగన్ స్థాయిలో పూర్తి నమ్మకం రావాలి అంటే ఆ పార్టీ జెండాతో గెలిస్తేనే మంచిది. అప్పుడు టీడీపీకి సరిగా సమాధానం చెప్పుకోవచ్చు. వైసీపీలో పూర్తిగా కలిసిపోవచ్చు. అందుకే ఇప్పుడు చేరిన నలుగురిలో రాజీనామాకు ఎవరెవరు సిద్ధం అనేదే పెద్ద ప్రశ్న..!!

గణేష్ సవాళ్లు చేస్తున్నారు..!!

వాసుపల్లి గణేష్ నిన్న వైసీపీ కి జై కొట్టారు. ఆయన ఎందుకు జై కొట్టారో, టీడీపీని వీడి ఎందుకు అధికార పార్టీలో చేరారో అందరికి తెలియకపోవచ్చు. ఆయన వ్యాపార సామ్రాజ్యాలు, ఆర్ధిక కోతలు కాపాడుకునే క్రమంలో తప్పలేదు. అయితే ఆయన పూర్తిగా వైసీపీ వాదిగా మారిపోయే ప్రయత్నాలు ఆరంభించారు. అందుకే సవాళ్లు చేస్తున్నారు. రాజీనామా చేస్తా, మళ్ళీ వైసీపీ జెండాతో గెలుస్తా.., టీడీపీ కి భవిష్యత్తు లేదు అంటూ స్పీచ్ లు దంచేస్తున్నారు. విశాఖ రాజధానిగా ప్రకటించిన నేపథ్యం, అధికార అండ, ఆర్ధిక అండ చూసుకుని.., గెలుపుపై నమ్మకంతో ఆయన ఉప ఎన్నికకు సై అంటున్నారు.

Vamsi dutta

గన్నవరం వంశీ సిద్ధమే కానీ..!!

ఇక గన్నవరం నియోజకవర్గం వల్లభనేని వంశీ కూడా పూర్తి వైసీపీ వాదిగా మారే క్రమంలో టీడీపీని ఆడేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు తన రాజీనామా విషయమై ప్రకటించారు. తాను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమే అంటూ చెప్పుకొస్తున్నారు. వైసీపీ జెండాతో గెలిచి పూర్తిగా ఆధిపత్యం చాటాలనేది ఆయన వ్యూహం. కానీ ఆయనకు అక్కడ అంత అనుకూల పరిస్థితులు లేవు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు వర్గం, 2019 లో వైసీపీ తరపున పోటీ చేసి ఒడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు వర్గం ఇప్పటికే వంశీపై కత్తులు నూరుతున్నారు. ఈ వర్గాలు సహకారం లేకుండా వైసీపీ గుర్తుతో పోటీ చేసి గెలవడం వంశీకి అసాధ్యమే.

బలరాం ఆ మాట తప్ప..!!

చీరాల కరణం బలరాం మాత్రం రాజీనామా, రాజకీయ అంశాల జోలికి వెళ్లడం లేదు. చీరాల అభివృద్ధి కోసమే వచ్చాను అంటూ ఆయన కుమారుడు వెంకటేష్ చెప్పుకొస్తున్నారు. ఎక్కడా టీడీపీని, చంద్రబాబుని విమర్శించడం లేదు. వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ తరహాలో సవాళ్లు చేయడం లేదు, టీడీపీకి తొడ కొట్టడం లేదు. అసలు రాజీనామా అనే ప్రస్తావనే తీసుకురావడం లేదు. ఒకవేళ ఈయన రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళాలి అని ఆలోచన వచ్చినా అక్కడ బలంగా ఉన్న ఆమంచి కృష్ణ మోహన్ పోటీలో ఉంటారు. అసలే సొంత నియోజకవర్గం కాదు, సొంత వర్గం అంటూ లేదు. ఇప్పుడిప్పుడే అన్ని సర్దుబాటు చేసుకుంటున్నారు, ఈ క్రమంలో రాజీనామా, ఉప ఎన్నికలు అంటే పూర్తిగా రిస్క్ అని కరణం అసలు ఆ అంశాలనే ప్రస్తావించడం లేదు. టీడీపీ పట్ల సేఫ్ గేమ్ లో ఉన్నారు.

cm jagan to focus on ysrcp social media wing
cm jagan to focus on ysrcp social media wing

మద్దాల గిరి సైలెంట్ గానే..!!

ఇక మరో ఎమ్మెల్యే మద్దాల గిరిధర్. గుంటూరు పశ్చిమ నుండి గెలిచారు. నిజానికి టీడీపీ నుండి 2019 ఎన్నికల్లో ఈయన గెలుపే అనూహ్యం. వైసీపీ అభ్యర్థి వేణుగోపాలరెడ్డి పై ఉన్న అసమ్మతి, అసంతృప్తి కారణంగానూ.., గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హవా కారణంగానూ గిరి గెలిచారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే పూర్తిగా వెనకడుగు వేసేది గిరి. ఆయన పూర్తిగా సేఫ్ గేమ్ లో ఉన్నారు. రాజీనామా, ఉప ఎన్నిక అనే మాటలకు దూరంగా ఉంటున్నారు. దొరికిందే అవకాశం అన్నట్టుగా నెమ్మది రాజకీయం చేసుకుంటున్నారు. ఒకవేళ ఈయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే మాత్రం వేణుగోపాల రెడ్డి నుండి పూర్తిగా తిరుగుబాటు వచ్చి, ఉత్కంఠ ఖాయం.

author avatar
Srinivas Manem

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju