NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కిరణ్ కేసులో కీలక మలుపు !

చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో నిందితుడైన చీరాల టూటౌన్ సబిన్స్పెక్టర్ విజయకుమార్ పై ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్లను కూడ జోడిస్తూ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

A key turning point in the Kiran case
A key turning point in the Kiran case

ఈ మేరకు బుధవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.జులై 18వ తేదీన మాస్కు పెట్టుకో లేదన్న కారణాన్ని చూపి కొత్తపేట జంక్షన్ వద్ద ఎస్సై విజయ్ కుమార్ తీవ్రంగా కొట్టడంతో కిరణ్ మరణించడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అప్పట్లో ఎస్సై విజయకుమార్ పై కేవలం ఐపీసీ 324 సెక్షన్ కింద మాత్రమే కేసు కట్టారు. అయితే మరణించింది ఎస్సీ యువకుడు కావడంతో ఎస్సై పై ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ల కింద కూడా కేసు పెట్టాలంటూ మృతుడి తండ్రి మోహన రావు పోలీసు ఉన్నతాధికారులను లిఖితపూర్వకంగా కోరారు.

 

A key turning point in the Kiran case
A key turning point in the Kiran case

దీనిపై ఈ కేసు విచారణాధికారి డీఎస్పీ బాలసుందరరావు సమగ్రంగా దర్యాప్తు జరిపి ఎస్సై విజయ్ కుమార్ పై ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా పెట్టాలంటూ సిఫార్సు చేయడంతో చీరాల టూటౌన్ సిఐ ఇన్చార్జి సీఐ స్రవంతి రాయ్ ఈ మేరకు సదరు సెక్షన్లు సవరించి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. మొదట్లో తప్పటడుగులు వేసిన ఈ కేసు విచారణ ఇప్పుడు సరైన దారిలో పడింది. తమకు న్యాయం జరుగుతుందనే ఆశ ఇప్పుడిప్పుడే కలుగుతోందని కిరణ్ కుమార్ తండ్రి మోహనరావు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని పోలీసు శాఖ కూడా సంతృప్తి కరమైన రీతిలోనే దర్యాప్తు చేస్తోందని ఆయన తెలిపారు.ఇందుకు గాను ఎస్పీ సిద్ధార్థ కౌశలు కి కృతజ్ఞతలు చెప్పారు.

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju