ప్రస్తుతం దేశంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. చాలా పథకాలకు మరియు ప్రభుత్వాలు నుండి వచ్చే రాయితీలకు ఆధార్ కార్డు తప్పనిసరి. కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినది ఆధార్ కార్డ్. దేశంలో ప్రతి పౌరుడి జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి ఈ ఆధార్ కార్డు చిటికెలో డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం.
డిజిటల్ ఆధార్ డౌన్ లోడ్ ఇలా:-
*మొబైల్ / డెస్క్ టాప్ లో గాని ఉడాయ్ పోర్టల్ లో (uidai.gov.in) డౌన్ లోడ్ ఆధార్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి.
*అక్కడ మీ ఆధార్ నెంబర్ గానీ, వర్చువల్ ఐడి నెంబర్ గాని, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ గాని ఎంటర్ చేయాలి.
*ఆధార్ కార్డు నెంబర్ ఇతరులకు తెలియకుండా ఉండేందుకు ఉడాయ్ వర్చువల్ ఐడి నెంబర్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 12 అంకెల ఆధార్ నెంబర్ లో కేవలం నాలుగు నెంబర్లు మాత్రమే కనిపించి దిగువ భాగంలో వర్చువల్ ఐడి నెంబర్ కనిపిస్తుంది. అందుకోసం ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది దాన్ని క్లిక్ చేయాలి.
*ఆ తర్వాత మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
*ఈ ప్రాసెస్ మొత్తం పూర్తవగానే మీ మొబైల్ లేదా డెస్క్ టాప్ లోకి డిజిటల్ ఆధార్ కాపీ పిడిఎఫ్ ఫార్మేట్ లో డౌన్ లోడ్ అవుతుంది. అయితే, అది తెరవాలంటే మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (క్యాపిటల్ అక్షరాలలో ఆధార్ కార్డు ప్రకారం), తప్పనిసరిగా పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన ప్రాసెస్ లో చిటికెలో ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.