NewsOrbit
జాతీయం రాజ‌కీయాలు

పశ్చిమ బెంగాల్ మంత్రి చేసిన కుంభకోణంలో ఈడీకి అడ్డంగా బుక్ అయిన నటి అర్పిత ముఖ‌ర్జీ..!!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎస్.ఎస్.సీ స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళ్తే పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పార్థ చటర్జీ సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ పాఠశాలల ఉద్యోగాల కుంభకోణం కేసులో ఈడీ గత శనివారం అరెస్టు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఇప్పటికే 21 కోట్ల రూపాయల నగదును పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఆమెకు చెందిన మరో ఇంట్లో మరింత నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈడీ అధికారులు అర్పిత ముఖర్జీ రెండో ఫ్లాట్ లో నిర్వహిస్తున్న సోదాలలో రూ. 28.90 కోట్ల నగదు, 5 కేజీలకుపైగా బంగారం, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా పట్టుబడిన సొమ్ము కూడా కుంభకోణం ద్వారా సంపాదించిందే అని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

Actress Arpita Mukherjee booked against ED in West Bengal Minister Partha Chatterjee scam..!!

రెండు ఫ్లాట్లలో భారీగా నగదు .. నోట్ల కట్ల లభ్యం కావడంతో..ఈడీ అధికారులు దొరికిన సొమ్మును లెక్కపెట్టడానికి.. నోట్ల లెక్కింపు మిషన్ తో పాటు బ్యాంకు అధికారులను రప్పించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మాజీ విద్యాశాఖ మంత్రి పార్ధా చటర్జీ మాత్రం దర్యాప్తునకు సరిగ్గా సహకరించటం లేదని..ఈడీ అధికారులు తెలియజేస్తున్నారు. దొరికిన సొమ్ము పార్ధా చటర్జీకి చెందినదని ఈడీ అధికారులు తెలియజేశారు. దీంతో ఇప్పుడు దేశ రాజకీయాలలోనే పశ్చిమ బెంగాల్ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది నియామక కుంభకోణం చర్చనీయాంశంగా మారింది. జరుగుతున్న తనిఖీలలో సినీ నటి అర్పిత ముఖర్జీ ఇంట్లో లభ్యమైన నల్ల డైరీ లో.. కుంభకోణానికి సంబంధించిన కీలక రహస్యాలు ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

Actress Arpita Mukherjee booked against ED in West Bengal Minister Partha Chatterjee scam..!!

ఈ కుంభకోణంలో మరిన్ని రహస్యాలను డైరీ ద్వారా లభ్యమయ్యే అవకాశం ఉందని ఈడీ వర్గాలు అంటున్నాయి. మంత్రి పార్థ చటర్జీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా 2014-2021 మధ్యకాలంలో పనిచేయడం జరిగింది. అప్పట్లోనే ఉద్యోగాల నియామకాల విషయంలో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల ఈడీ అధికారులు గత శుక్రవారం సోదాలు నిర్వహించగా… మొదట 21 కోట్ల రూపాయలు బయటపడటంతో వెంటనే 26 గంటలు ప్రశ్నించిన తర్వాత మంత్రి పార్ధ చటర్జీని.. అరెస్టు చేశారు. ఆ తర్వాత శనివారం బెంగాలీ నటి అర్పిత చటర్జీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఓ బెంగాలీ నటుడు తనని మంత్రి పార్ధకు పరిచయం చేయడం జరిగిందని ఈడీ విచారణలో అర్పిత ముఖర్జీ తెలియజేసింది. 2016 నుండి ఇద్దరి మధ్య పరిచయం ఉందని.. కాలేజీ గుర్తింపు కోసం ఇచ్చిన లంచాలదే ఆ డబ్బు మొత్తం అని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ డబ్బును మంత్రి ఎప్పుడు తీసుకురాలేదని, అతని మనుషులు మాత్రమే ఫ్లాట్ కి  తెచ్చేవారని స్పష్టం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని కూడా మినీ బ్యాంక్ లా మంత్రి పార్ధ వాడినట్లు.. ఆమె కూడా పార్ధాకు సన్నిహితురాలని అర్పిత ముఖర్జీ విచారణలో కీలక సమాచారం ఇవ్వటం జరిగింది. ఇదిలా ఉంటే ఆగస్టు మూడవ తారీకు వరకు మంత్రిపార్థతో పాటు అర్పిత ముఖర్జీ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వడం జరిగింది.

Related posts

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?