NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పాపం అద్వానీ, జోషీ..!!

అయోధ్య రామమందిరం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ ఏర్పాట్లకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి ఇంకా ఎవరెవరు హాజరవుతారు అనే దాని విషయంలో పూర్తి స్పష్టత రాలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పరిమిత సంఖ్యలోనే ప్రముఖులను ఆహ్వానించనున్నారు. ప్రధాని మోడీ చేతుల మీదగా ఆగస్టు ఐదవ తారీకు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల దివ్య ముహూర్తాన రామమందిర శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఇటువంటి కీలక ఘట్టం లో రాముడి భూమి కోసం పోరాడిన ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి లకు అన్యాయం జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. 

adhwani manohar latest news
adhwani manohar latest news

నాడు ఉద్యమానికి ఊపిరి ఊదారు..

అయోధ్యలో రామమందిరం కోసం నాడు ఉద్యమానికి ఎంతగానో కృషి చేసిన భాజపా అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి లకు ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అదే సమయంలో ఎల్.కె అద్వానీ, మురళీమనోహర్ జోషిలతో పాటు మందిరం కోసం పోరాడిన ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కు ఆహ్వానం అందటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పట్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎల్.కె.అద్వానీ మురళీమనోహర్ చేసిన ఉద్యమం, పోరాటం చాలా కీలకం. ఇప్పుడు ఈ విధంగా అయోధ్యలో  రామమందిర భూమి పూజ జరుగుతుందంటే దానికి కారణం వారి పోరాటమే అని పార్టీలో సీనియర్లు అంటున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విషయంలో ఈ ఇద్దరు అగ్ర నేతలు చట్ట రీత్యా అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు. అటువంటిది వీరికి ఆహ్వానం రాకపోవటం పట్ల చాలామంది కార్యక్రమ నిర్వాహకులపై మండిపడుతున్నారట.

రామమందిర నిర్మాణం కోసం పార్టీని బలోపేతం చేశారు..

అప్పట్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అద్వానీ, జోషి భాజపా పార్టీని బలోపేతం చేస్తూ… కాంగ్రెస్ పార్టీతో పోరాడుతూ దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించి కీలక పాత్ర ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాల్లో పోషించారు. బీజేపీలో ప్రతీ నాయకుడిని ఏకతాటిపైకి తీసుకువస్తూ ఒకపక్క రామమందిర నిర్మాణం కోసం పోరాటం చేస్తూనే  మరోపక్క బిజెపి పార్టీని మురళీ మనోహర్ జోషి, ఎల్.కె.అద్వానీ రాజకీయంగా ముందుకు నడిపించారు. అప్పట్లో అనేక కేసులు ఎదుర్కొని పార్టీని ఒక గాడి లోకి తెచ్చి… పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి 2014 ఎన్నికల టైం కి బిజెపి కి ఒక షేప్ క్రియేట్ చేసింది చాలావరకు ఈ ఇద్దరే అని పార్టీలో చాలామంది సీనియర్స్ ఇప్పటికి అంటుంటారు. 

ఇప్పుడు ఇద్దరు నేతలు శంకుస్థాపనకు దూరం… 

అటువంటిది ఈ ఇద్దరిని అయోధ్య రామ భూమి పూజ కార్యక్రమం శంకుస్థాపనకు దూరం పెట్టడం పట్ల చాలామంది బిజెపి పార్టీలో ఉన్న సీనియర్ నేతలే పైకి చెప్పకపోయినా లోలోపల బాధపడుతున్నట్లు సమాచారం. ఒకపక్క అయోధ్య రామ భూమి పూజ అంగరంగ వైభవంగా జరుగుతున్న…అయోధ్య భూమికి సంబంధించిన కేసులలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు ఇంకా విచారణ సంస్థలు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ రీతిలో పోరాటం చేసిన వీళ్లకు అయోధ్య భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు రాకపోవటం సంచలనంగా మారింది. 

కారణమదేనంటున్న పార్టీ… కానీ అద్వానీకి పేరు రాకూడదనేనా… 

పరిస్థితి ఇలా ఉండగా ఈ కార్యక్రమానికి బిజెపి అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లకి  ఆహ్వానం రాకపోవటానికి కారణం వయోభారం మరియు ఆరోగ్య కారణాల …. వల్లే అని, కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరోక్షంగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు శ్రీరామ్ రామ్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంతం నిత్య గోపాల్ దాస్ తెలిపారు. కానీ పార్టీలో లోలోపల వినబడుతున్న టాక్ ప్రకారం అద్వానీ ఈ కార్యక్రమానికి వస్తే  ఆయన పేరే హైలెట్ అవుతుందని, అది నచ్చక పార్టీలో కొంతమంది కీలక నాయకులు అద్వానీకి పేరు రాకూడదనే వయసు, ఆరోగ్యం అంటూ ఆయన ని పక్కన పెట్టినట్లు టాక్ వినపడుతోంది. ఏది ఏమైనా ఈ ఇద్దరు నేతలకి అయోధ్య భూమి పూజ లో ఆహ్వాన పత్రికలు పంపక పోవడం పట్ల దేశ వ్యాప్తంగా మరియు పార్టీ పరంగా పాపం అనే రీతిలో అందరూ చర్చించుకుంటున్నారు. 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?