అయ్యయ్యో పవన్ కల్యాణ్ .. ఎంతపని జరిగింది అంటున్న ప్రత్యర్ధులు !!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ప్రకటనలు ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే బిజెపి పార్టీ తో చేతులు కలిపిన తర్వాత ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు విషయంలో వస్తున్న విమర్శలు పవన్ ని ఇరకాటంలో పెడుతున్నట్లు టాక్ వినపడుతోంది. ఎందుకంటే సినిమా స్టార్ గా పవన్ అన్ని మతాలవారు, కులాలవారు అభిమానిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు, మతాలు చుట్టూ తిరుగుతూ ఉన్న తరుణంలో తనకు అండగా ఉండే కొన్ని వర్గాలు దూరమవుతాయనే భావనలో డైలమాలో పవన్ పడినట్లు టాక్ వినబడుతుంది.

Pawan Kalyan's Three Films: A Section Deeply Disappointed | Gulte - Latest Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photosఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కొన్ని ఆందోళన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా….పవన్ నేరుగా రాకుండా ఉండటమే దీనికి నిదర్శనం అనే టాక్ గట్టిగా వస్తుంది. అంతర్వేది విషయంలో ప్రకటన చేసి చేతులు దులుపుకొని ఉన్న పవన్ కళ్యాణ్.. నేరుగా బిజెపి తలపెడుతున్న ఏ కార్యక్రమంలో పాల్గొన లేదు. మరోపక్క తాను నమ్మిన బీజేపీ హైకమాండ్ చాలా వరకు తన ప్రత్యర్థి వై.ఎస్.జగన్ ని పొగుడుతూ ఉండటంతో…. పవన్ తట్టుకోలేక పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మత రాజకీయాలకు సంబంధించి జగన్ పై విమర్శలు చేస్తున్నా కానీ అది పరోక్షంగా పవన్ కళ్యాణ్ కి కూడా టచ్ అవుతున్నట్లు… దీంతో బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నాననే భావనలో పవన్ ఉన్నట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

అటు కక్కలేక ఇటు మింగలేక అన్నట్టుగా పవన్ పరిస్థితి మారినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్న తరుణంలో… ప్రత్యర్థులు అయ్యో పవన్ కళ్యాణ్ ఎంత పని జరిగింది అనే సెటైర్లు వేస్తున్నారట. రాజకీయాల్లో డైలాగులు కాదు…  చెప్పిన సిద్ధాంతం పై నిలబడే తత్వం ఉండాలి అని అంటున్నారట. రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభంలో నాకు కులం లేదు మతం లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నీచాతి నీచంగా, ఏపీ రాజకీయాలలో కుట్ర పూరితంగా మత రాజకీయాలు చేసే వారితో జత కట్టి తన పరువు తానే తీసుకుంటున్నారని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాకుండా మెగా హీరోలకు కూడా భవిష్యత్తులో తాకే అవకాశం ఉందని పరిశీలకుల మాట. సినిమా పరంగా చూసుకుంటే మెగా హీరోల సినిమాలను ఎక్కువగా ఆదరించేది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని… వీళ్లంతా పవన్ రాజకీయ ఎత్తుగడ కి మెగా ఫ్యామిలీ కి దూరం అవడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగా వినబడుతోంది.