బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Kcr vs Etela: కేసీఆర్ కు మరోసారి దొరికిన ఈటల..! ఈసారి కుమారుడు నితిన్..!!

alligations on etela rajender son
Share

Kcr vs Etela: కేసీఆర్ వర్సెస్ ఈటల Kcr vs Etela మాజీ మంత్రిపై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో జరిగిన సంఘటనలన్నీ తెలిసిందే. ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించడం, ఆరోపణలపై విచారణ చేయించడం దగ్గర నుంచీ అన్నీ సంచలనాలే నమోదయ్యాయి. ఇక ఈటలకు మిగిలింది ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. ఎమ్మెల్యే పదవికి ఈటలే స్వయంగా రాజీనామా చేయడం. ఈనేపథ్యంతో తెలంగాణలో సరికొత్త రాజకీయానికి నాంది పలికేలా ఈటల అటు కాంగ్రెస్ నేతలను కలుస్తున్నట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు వినికిడి. ఈనేపథ్యంలో ఈటల మరోసారి సీఎం కేసీఆర్ కు దొరికారు. ఈటల కుమారుడు నితిన్ పై భూకబ్జా ఆరోపణలు స్వయంగా సీఎంకే ఫిర్యాదు అందడంతో విచారణకు ఆదేశించారు.

alligations on etela rajender son
alligations on etela rajender son

మేడ్చల్‌ మండలం రావలకోల్‌ గ్రామానికి చెందిన పిట్లం మహేష్‌ ముదిరాజ్ ఈ ఫిర్యాదు చేశారు. 1954 నుంచి ఖాస్రా పహాణీలో సర్వే నెంబర్ 77లో సుమారు 10.11 ఎకరాల భూమి ఉంది. 1975-76లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం అప్పట్లో మహేశ్ తాత పిట్లం నరసింహానికి ఆ భూమి ఇచ్చింది. దీనిపై గతంలో ధృవపత్రం కూడా జారీ చేసింది ప్రభుత్వం. ఈ రికార్డులను కొందరు బలవంతంగా లాక్కుని చించివేశారనేది మహేష్‌ ముదిరాజ్ ఆరోపణ. 1986లో సత్యం రామలింగరాజు, కొందరు ప్రముఖుల పేర్లతో ఈ పహాణీలు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తరువాతి కాలంలో వీటిని ఇనాం భూమిగా పత్రాలు సృష్టించి నితిన్ రెడ్డితోపాటు సాదా కేశవరెడ్డి పేరు మీదకు మార్చుకున్నారని ఆరోపించాడు. అభ్యంతరం చెప్పిన బెదిరించి.. చిత్ర హింసలు పెట్టారన్నాడు. ఈ విషయాన్ని ఈటల రాజేందర్ కు గతంలో చెప్పినా తనపైనే ఆగ్రహం వ్యక్తం చేసారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ విషయాలతో సీఎం కేసీఆర్, సీఎస్‌కూ లేఖ రాయడంతోపాటు మే18న జిల్లా కలెక్టర్ కూ ఫిర్యాదు చేశారు. దీనిపైనే స్పందించిన కేసీఆర్ వెంటనే విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఏకంగా సీఎం ఆదేశించడంతో ఈ భూములపై త్వరలోనే విచారణ పూర్తవడం ఖాయం. మరి.. ఇందులో ఎవరి ప్రమేయం ఏంటో.. నితిన్ భూకబ్జాకు పాల్పడితే సీఎం తదుపది చర్యలేంటో చూడాలి.


Share

Related posts

ఏం సాయి రెడ్డి సారూ -ఏంది ఇలా చేశారు : వైకాపాలో ప్రశ్నలు?

somaraju sharma

సరిగ్గా ఉపఎన్నికకు ముందు వైసిపికి సహకరిస్తున్న బిజెపి..! వీళ్ల ప్లాన్ ఏంటో అర్థం కాదు

siddhu

రాష్ట్రంలో ముక్కోణమే…పవన్ కల్యాణ్

Siva Prasad