NewsOrbit
Featured రాజ‌కీయాలు

సంచలన నిర్ణయం దిశగా గుంటూరు.., కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలు…!

మూడు రాజధానుల బిల్లు ఆమోదం రాష్ట్రంలో రాజకీయ అడుగులను అత్యంత వేగంగా శాసిస్తుంది. రాష్టం మొత్తం మీద ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. రాజధానుల వికేంద్రీకరణ రాష్ట్రానికి లాభమా, నష్టమా అనే చర్చ కాకుండా… జగన్ కి లాభమా, నష్టమా…?? టీడీపీకి లాభమా, నష్టమా..? అనే చర్చ జరుగుతుంది. ఇక ఈ విషయంపై కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం ప్రజా ప్రతినిధులకు ఏమి అంతుపట్టడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అనేక ఆలోచనల్లో పడ్డారు. ఒక రకంగా సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారు.

వైసీపీలో అంతర్మధనం మొదలు…!

రాజధాని అనేది ఈ రెండు జిల్లాల్లో సెంటిమెంట్ వ్యవహారంగా మారింది. జగన్ కి అధికారం దక్కడంతో ఈ రెండు జిల్లాల ఓటర్లు ఏకపక్ష నిర్ణయం తీసుకుని, గత ఏడాది ఎన్నికల్లో ఓట్లేశారు. రెండు జిల్లాల్లో కలిపి వైసిపికి 29 మంది శాసనసభ్యులను అందించారు. కానీ జగన్ అధికారంలోకి వస్తే రాజధాని మార్పు ఉంటుందని, వికేంద్రీకరణ ఉంటుందని అసలు ఊహించలేదు.

ap government shock to chanrababu naidu

కానీ అది జరిగిపోవడంతో వైసీపీకి ఈ రెండు జిల్లాల్లో కొంత వ్యతిరేకత తప్పదు. ఇదే విషయంపై ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అంతర్మధనం మొదలయింది. రాజధాని మార్పు ఉండదు అని కచ్చితంగా చెప్పిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, వసంత కృష్ణప్రసాద్ సహా…, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి నేతలు ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే వీళ్ళందరూ జగన్ కి అత్యంత సన్నిహితులే, నమ్మిన బంటులే… ఈరోజు సాయంత్రం లేదా, రేపు విజయవాడలోని ఓ హోటల్ లో ఈ కీలక నాయకులు అందరూ సమావేశమవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ వేదికగా తమ నిర్ణయాలు వెల్లడించనున్నారు.

 

టీడీపీ రాజీనామాలకు సిద్ధమే…!

ఈ రెండు జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. తాము రాజీనామా చేసి, వైసీపీపై ఒత్తిడి తీసుకు రావచ్చేది వీరి వ్యూహం. రాజధాని సెంటిమెంట్ తో రాజీనామా చేసినా.., ఎలాగూ గెలుస్తారనే ధీమా ఉండడంతో అందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు తప్ప కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామా విషయంలో పూర్తిగా సిద్ధంగా ఉన్నారట. అలా చేస్తేనే వైసిపిపైకి ఒత్తిడి పెరుగుతుందని, వాళ్ళనూ రాజీనామా చేయిస్తే.. ఒత్తిడి తెచ్చినా నైతికంగా గెలిచినట్టేనని చంద్రబాబు యోచనగా కనిపిస్తుంది.

 

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju