NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అమెరికా అధ్యక్షుడు అవ్వాలన్నా మనవాళ్ళు ఓటు వేయాల్సిందే.. అది ఏంటో చదవండి.. !!

ఒక వైపు కరోనా ప్రపంచాన్ని భయపెడుతోంది. కానీ ఈ భయం మధ్యనే అగ్రరాజ్యం అమెరికా ఒణికిపోతుంది. చిగురుటాకుల్లా విలవిల్లాడుతోంది. కరోనా ధాటికి లక్షల మంది మృత్యువాతపడుతున్నారు ఆ దేశంలో. కానీ అమెరికా పీఠం కానీ కొద్ది రోజుల్లోనే మారిపోతుంది. అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తోంది. మరో వంద రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భిన్నమైన ఎన్నికల వ్యవస్థ ఉన్న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. డెమొక్రాట్ లు, రిపబ్లికన్లు హోరా హోరీగా తలపడుతున్నారు. ట్రంప్ ను ఎలాగైనా ఓడించాలని ఈ సారి బిడెన్ రంగంలోకి దిగారు. అయితే అమెరికాలో ఎంత మంది ఓటర్లు ఉన్నా రెండు పార్టీలు ఎంత మందికి వలలు వేసినా అక్కడ మన ఓట్లు మాత్రం కీలకం. మనోళ్లు ఓట్లు వేసే వల్లే గెలుస్తారు. అంత ప్రభావం అమెరికాలో మన ఇండియన్ లు సంపాదించారు.

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారతీయ ఓటర్లు కీలకంగా ఉన్నారు. దీంతో భారతీయులను ఆకట్టుకునేందుకు రెండు ప్రధాన పార్టీలు రిపబ్లికన్ డెమోక్రాటిక్ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రధానంగా అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో భారతీయ ఓటర్లు దాదాపు 13 లక్షలకు పైగా ఉన్నారు. ఎప్పుడు డెమొక్రాట్ లకు అండగా నిలిచే భారతీయులు ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ ల వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.

డెమోక్రాటిక్ పార్టీకి భారతీయ అమెరికన్ లో అతిపెద్ద ఓటు బ్యాంకు. ఈ ఓటు బ్యాంకును కాపాడుకుని తో పాటు మరింత పెంచుకునేందుకు యత్నిస్తుండగా, డెమోక్రాట్ లకు చెక్ పెట్టేందుకు రిపబ్లికన్లు వ్యూహరచన చేస్తున్నారు. ఈ దిశగా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. భారత ప్రధాని మోదీతో ఉన్న  సాహిత్యం,  ఇటీవల జరిగిన నమస్తే ట్రంప్, హౌడీ మోడీ కార్యక్రమాలు ఇండో అమెరికన్ లను తనవైపుకు ముగ్గు చూపేలా చేస్తాయని ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు ఇండో అమెరికన్లు కీలకంగా ఉన్న రాష్ట్రాల్లో వారిని ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా 100 మందితో కూడిన నిపుణుల బృందంతో కార్యాచరణ ప్రారంభించింది. గత ఎన్నికల్లో 77 శాతం మంది ఇండో అమెరికన్ లు  డెమోక్రాటిక్ పార్టీకి ఓట్లు వేశారని, ఈసారి అది పునరావృత్తం కాదన్న ధీమాతో ఉన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju