NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రుణాంధ్ర కి అమెరికా ట్రస్టుకి లింకు ఏంటి…??

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అయన పరిపాలనా తీరు కారణంగా పెట్టుబడులు వెనక్కు పోతున్నాయి. పరిశ్రమలు రావడం లేదంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీతో సహా ఇతర రాష్ట్రాలు తీవ్ర ఆశ్చర్యపోయే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన పత్రికలు ఏవీ బయట పెట్టని ఈ విషయాన్ని ది పయనీర్ అనే ఆంగ్ల దిన పత్రిక వెలుగులోకి తీసుకుని వచ్చింది.

అది ఏమిటంటే.. ఏపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నమ్మకంతో అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ ట్రస్ట్ తొమ్మిది బిలియన్ డాలర్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు 67,500 కోట్ల రూపాయల రుణాన్ని ఏపి ప్రభుత్వానికి ఇవ్వనుందట. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఇవ్వడానికి అంగీకరించిందట ఆ ట్రస్ట్. అంతే కాకుండా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం మరో 28వేల కోట్ల రూపాయల రుణానికి అదనపు ప్రతిపాదనగా ఉందట. ఈ ఋణం కోసం ఏపి అధికారులు రెండు నెలలుగా ప్రయత్నిస్తున్నారట. దాదాపు పది వేల కోట్ల రుణానికి ఓకే చెప్పిన సదరు ట్రస్ట్… కండిషన్స్ అప్లై అన్నట్టు భారత ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిబంధన పెట్టిందట. అంతా ఓకే అయితే నాలుగు శాతం వడ్డీతో 40ఏళ్లలో ఈ ఋణం తీర్చాల్సి ఉంటుంది.

ఇంత పెద్ద మొత్తంలో ఓ ప్రైవేట్ ట్రస్ట్ నుండి ఋణం తీసుకోవాలంటే ఫెమా, ఆర్బీఐ నిబంధనలు అడ్డుపడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. దీనికి సంబందించిన క్లియరెన్స్ కోసమే రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కలాంలు ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ సీఈఒ అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ సలహాదారు అవినాష్ మిశ్రా ల ను కలిసారని అంటున్నారు.

ఇంత పెద్ద ఋణం ఎలా సాధ్యమన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదే మాదిరిగా ఏపికి అంత పెద్ద ఎత్తున ఋణం ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆ ట్రస్ట్ ఎవరిది? అనే సందేహాలు వస్తున్నాయి. నిజం గా ఆ కధనం కరెక్ట్ అయి కేంద్రం అనుమతి తీసుకోని ఏపికి అంత పెద్ద ఋణం తీసుకోని వస్తే దటీజ్ జగన్ అనాల్సిందే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju