కలిసి వచ్చిన 72 గంటల తరవాత గుడ్ న్యూస్ చెప్పిన అమిత్ షా ?

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇటీవల వైయస్ జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు ప్రధాని మోడీ మరియు ఇతర మంత్రులను కలవడం జరిగింది. జగన్ ఢిల్లీ పర్యటనకి సంబంధించి టీడీపీ అనుకూల మీడియా… కేంద్ర మంత్రులు జగన్ కి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు.

Jagan meets Amit Shah, seeks funds for State- The New Indian Expressమరోపక్క వైసిపి వర్గాలు త్వరలోనే టిడిపి పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా వ్యాఖ్యానించారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఎక్కువగా మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే… ఈ పర్యటనలో అమరావతి, ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి సిబిఐ ఎంక్వయిరీ వేయించడానికి జగన్ ఈ పర్యటన చేపట్టినట్లు వార్తలు బాగా తయారయ్యాయి. ఇదిలా ఉండగా జగన్ ఢిల్లీ లో అమిత్ షా నీ కలిసి వచ్చిన 72 గంటల తర్వాత తాజాగా మరో గుడ్ న్యూస్ వైసీపీ పార్టీలో మీడియా వర్గాలు వినబడుతుంది.

అదేమిటంటే వైసిపి పార్టీని అనేక రీతులుగా ఇబ్బందుల పాలు చేసినా రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్ పై సత్వరం చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరడం జరిగినట్లు, తాజాగా ఈ విషయానికి సంబంధించి కేంద్రం కూడా వైసిపికి అనుకూలంగా వ్యవహరించడానికి రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు బయటపడింది. అదే విధంగా మూడు రాజధానులు విషయంలో న్యాయస్థానాలు జోక్యం గురించి కూడా కేంద్రం స్పష్టమైన వైఖరి మరికొద్ది రోజుల్లో చెప్పబోతున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో స్పష్టమైన వైఖరి కేంద్రం నుండి వస్తున్నట్లు వార్తలు రావడంతో వైసీపీ క్యాడర్ కూడా ఫుల్ హ్యాపీ లో ఉన్నట్లు టాక్. ఉన్న కొద్దీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా టిడిపి పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా చానల్ లకి పార్టీలో ఉంటూ వరుస  ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండటంతో వైసీపీకి చాలావరకు డ్యామేజ్ అవుతుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కి రఘురామకృష్ణంరాజు వ్యతిరేకమైన కామెంట్ చేస్తూ ఉండటంతో… మరికొద్ది రోజుల్లో రఘురామకృష్ణం రాజు కి వైసీపీ హైకమాండ్ తనదైన శైలిలో తాజా పరిణామాలను బట్టి చెక్ పెట్టబోతునట్లు సమాచారం.