NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Anam Ramnarayana reddy : తక్కువ చేస్తే ప్రమాదం!

Anam Ramnarayana reddy : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ప్రత్యేకమైన శైలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకమైన ఆర్థిక శాఖ నిర్వహించిన ఆనం రామనారాయణ రెడ్డి ఆయన మృతి తర్వాత రాజకీయంగానూ వెనుకబడ్డారు. ఇటీవల ఆనం వివేకానంద రెడ్డి మృతి తర్వాత ఆయన మరింత డీలా పడ్డారు. మాస్ లీడర్ గా ఇంటికి పెద్దగా కుటుంబ రాజకీయాలు ముందుకు తీసుకు వెళ్లిన ఆనం వివేకానంద రెడ్డి మృతి తర్వాత ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. అయితే రాజకీయాల్లో సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డిని ఇప్పుడు సొంత పార్టీ వైఎస్ఆర్సిపి సైతం కూరలో కరివేపాకు లా తీసి పారేయడం కొత్త వివాదాన్ని బయట పెడుతోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయిన ఆనం రామనారాయణ రెడ్డికి గణతంత్ర దినోత్సవ ఆహ్వానం జిల్లా అధికారులు పంపకపోవడం వెనుక… ఏదో విషయం దాగి ఉందనేది అర్థమవుతుంది. ఎవరో చెప్పిన దాని ప్రకారమే జిల్లా అధికారులు ఈ చర్యకు పూనుకున్నారు అనేది… ఆ చెప్పిన వ్యక్తి ఎవరు అనేది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.

Anam Ramnarayana reddy: Danger if you do less!
Anam Ramnarayana reddy Danger if you do less

ఇప్పటికే అవమానాలు!

ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ సిపి లోకి ఆలస్యంగా వచ్చారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఉన్న సీట్ల లభ్యతను బట్టి ఆయనను వెంకటగిరి నుంచి జగన్ పోటీ చేయించారు. సీనియర్ కావడంతో కొత్త నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ నుంచి గెలిచిన ఆనం రాంనారాయణరెడ్డి కి తర్వాత జగన్ ప్రాధాన్యం ఇవ్వడం లో మాత్రం మొండిచెయ్యి చూపారు. జిల్లాకు చెందిన మంత్రులుగా అనిల్ కుమార్ యాదవ్ మేకపాటి గౌతమ్ రెడ్డిలకు జగన్ అవకాశం ఇచ్చారు. పార్టీలో జూనియర్ అయినప్పటికీ రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన ఆనం వర్గానికి కనీసం మంత్రి పదవి మాట అటుంచితే కనీసం జిల్లా రాజకీయాల్లోనూ జిల్లా పరిస్థితుల్లోనూ ప్రాధాన్యత తగ్గించడం… దీనిపై పదేపదే ఆనం రామనారాయణ రెడ్డి బయటకు వచ్చి మరి ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ వైఖరి మీద సొంత పార్టీ తీరు మీద విమర్శలు చేస్తున్నప్పటికీ దానిని పార్టీలోని పెద్దలు ఎవరూ పట్టించుకోక పోవడం విశేషం. మరోపక్క జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఆనం రామనారాయణ రెడ్డికి అసలు పడటం లేదు. మొత్తం అంతా తానై అన్నీ నిర్ణయాలను, కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంత్రి అనిల్ తీరు మీద బహిరంగంగానే విమర్శలు వ్యక్తం చేసి ఆగ్రహం సైతం లెక్క చేసిన ఆనం తీరును జగన్ సైతం తర్వాత పట్టించుకోలేదు సరికదా… మరోపక్క మంత్రి అనిల్ ప్రాధాన్యాన్ని జిల్లాలు పూర్తిగా పెంచడంతో జగన్ ఆనం కు ఒక సంకేతాన్ని పంపినట్లు అయ్యింది. జిల్లా రాజకీయాలన్నీ అనిల్ కనుసన్నల్లోనే జరుగుతాయని అనవసరంగా ఎవరూ తలదూర్చ వద్దన్న ఈ విషయాన్ని జగన్ పదే పదే మంత్రి అనిల్ వ్యాఖ్యల ద్వారా చెబుతూనే ఉన్నారు. అయితే రాజకీయాల్లో తన సీనియారిటీని పార్టీ ఉపయోగించుకోవడం లేదన్నా కోపం తో పాటు మంత్రి పదవి సైతం తనకు దక్కలేదని అక్కసు ఆనం లో కనిపిస్తోంది. తాజాగా జిల్లా ప్రోటోకాల్ విషయంలోనూ ఆనం రామనారాయణరెడ్డి విస్మరించడం చూస్తుంటే అసలు పొమ్మనలేక పొగపెడుతున్న చందంగా ఆనం విషయంలో జగన్ ప్రవర్తిస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Anam Ramnarayana reddy : ఈ భేటీ ప్రత్యేకం!

ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నెల్లూరు విచ్చేసిన మంత్రి బొత్స ఆనం ఇంటికి వెళ్లి సుమారు మూడు గంటలసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ తీరు మీద.. జిల్లా రాజకీయాలు మంత్రి అనిల్ కుమార్ మీద పీకల వరకు ఉన్న ఆనం బొత్సతో ఏం చర్చలు జరిపారు అన్నది కీలకమే. బొత్స, ఆనం సమకాలికులు. వారిద్దరిదీ కచ్చితంగా రాజకీయ భేటీ. దీనిలో సందేహం లేకపోయినప్పటికీ ఆనం ఏం మాట్లాడారు ఎలాంటి విషయాలను బొత్స ముందుకు తీసుకువెళ్లారు భవిష్యత్ వ్యూహాలు ఏమైనా సిద్ధం చేస్తున్నారా అనేది ఇప్పుడు సందేహం. జమిలి ఎన్నికలు తరుముకొస్తున్న వేళ జగన్… కేసులను ఎప్పటికప్పుడు కోర్టులు విచారణ నిర్వహిస్తున్న వేళ ఏమైనా వీరి బ్యాట్ ఈ విషయంలో ఎలాంటి చర్చ జరిగింది అన్నది ఆసక్తి. వైయస్సార్ సిపి పార్టీ లో ప్రస్తుతం ఉన్న సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ఆనం రామనారాయణ రెడ్డి వంటివారు కీలకమైన సమయం గురించి వేచి చూస్తున్నారని వార్తలు వస్తున్న తరుణంలో… రోజురోజుకు వైఎస్ఆర్సీపీలో ఆనం వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో వీరు భేటీ ప్రత్యేకం కానుంది. దీని పరిణామాలు భవిష్యత్తులోనే తేలుతాయి.

author avatar
Comrade CHE

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!