లోకేష్ ని టార్గెట్ చేయటంలో కొడాలి నాని ని మించిపోయిన అనిల్ కుమార్ యాదవ్..!!

నారా లోకేష్ ని గానీ చంద్రబాబుని గాని విమర్శించడంలో ముందు ఉండే నాయకుడు కొడాలి నాని. ఏలాంటి సందర్భంలో అయినా వైసీపీ పార్టీ తరఫున కొడాలి నాని గాని… లోకేష్ గురించి మాట్లాడటం మొదలుపెడితే మామూలుగా పంచులు వర్షం కురిపించారు. సెటైరికల్ గా అసలు నారా లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అన్నట్టు విమర్శలు చేస్తుంటారు. లోకేష్ పప్పు అని .. ఎంతసేపు తినడం తప్ప ఎవరితో ఎలా ఉండాలో తెలియదు, కొవ్వు పెంచుకున్నాడు… ఈమధ్య లాక్డౌన్ సమయంలో పొట్ట తగ్గించాడు అంటూ ఇటీవల కొడాలి నాని లోకేష్ గాలి తీసేలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ ని టార్గెట్ చేయడంలో కొడాలి నాని ని మించిపోయే విధంగా మాట్లాడటం జరిగింది.

Andhra Pradesh: Is Nara Lokesh Naidu Also 70 Year Old?టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు. కాగా పోలవరం విషయంలో కూడా లోకేష్ అతిగా స్పందించడం తో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్… లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు వేస్తూ పప్పు మహారాజ్ చేసే ఆరోపణలకు సమాధానం చెప్పే అంత కర్మ అని అన్నారు. ఇంకా నాటుగా మాట్లాడుతూ అరె పప్పు బాయ్ మంగళగిరిలో నీకు అదే గతి అంటూ ఆయన విమర్శలు చేశారు. ఈసారి గోచి కూడా మిగలదని పేర్కొన్నారు. ఎంతమంది కట్టగట్టుకుని కుట్రలు పన్నినా జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు అని, 151 సీట్లతో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు అని వ్యాఖ్యానించారు.

 

మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడమని హెచ్చరించారు. నీలాగా మీ తండ్రి లాగా మీ తాత పార్టీని లాక్కుని జగన్ ముఖ్యమంత్రి కాలేదని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సమస్యలను పరిష్కరించనీ ఈ విధంగా సీఎం జగన్ పరిష్కరిస్తున్నారు అని కొనియాడారు. ముందు ట్రాక్టర్ సరిగా నడవడం నేర్చుకో అంటూ హితవు పలికారు. సొంత పార్టీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు అంటూ ఎద్దేవా చేశారు. అదేవిధంగా పోలవరం పనులు 70 శాతం పూర్తయిన మీసాలు తీసేస్తానని నేత ఎక్కడ అని మీసాలు లేని లేని నేత మాట్లాడుతున్నాడు అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. లక్ష కుటుంబాలు ఉన్నాయని అన్నారు. “వారందరికీ ఇళ్లు నిర్మించాలి. యాభై శాతమే పూర్తయ్యాయంటే వినరు. ఏ కమీషన్ల కోసం క్యాబినేట్ నోట్ పెట్టారో చెప్పండి. పోలవరం పూర్తిచేసి తీరుతాం. శాన్ ఫోర్డ్ వీరుడు, పప్పు వీరుడు. ఏ జన్మలో పుణ్యం చేసుకోబట్టో జగన్ క్యాబినేట్ లో నీటిపారుదల శాఖ మంత్రిని అయ్యా. జగన్ పాదం వల్లే రెండేళ్లుగా డ్యాంలన్నీ నిండుతున్నాయి. మీతాత, మీనాన్న ముఖ్యమంత్రులైనా మంగళగిరిలో ఓడిపోయావ్.” అని ఎద్దేవా చేసారు.