చింతమనేనిపై మరో కేసు నమోదు:అరెస్టు

దెందులూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌పై కేసుల పరంపర కొనసాగుతున్నది. 2018లో జరిగిన ఘటనపై మరో కేసు నమోదైంది. పెదవీగిలో మోడికొండ మురళీకృష్ణ అనే వ్యక్తిని నిర్బంధించి కొట్టారన్న అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో జరిగిన ఈ ఘటనపై తాజాగా కేసు నమోదు చేసి కోర్టు ఎదుట పోలీసులు ఆయనను హజరుపర్చారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. 2017 సెప్టెంబర్ ఆరవ తేదీన పెదపాడు మండలం తాళ్లమూడికి చెందిన కొసనం వెంకటరత్నం అనే వ్యక్తిని అపహరించి కొట్టి కులం పేరుతో దూషించారన్న అభియోగంతో చింతమనేని ప్రభాకర్‌పై గతంలో కేసు నమోదైంది. చింతమనేని ఇప్పటికే నాలుగు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.