NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబును ఓ ఆట ఆడుకునే చాన్స్‌… బీజేపీకి ఇచ్చిన వైసీపీ

YS Jagan: Can Control Central upto 2024

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటుగా గ‌తంలో అధికారంలో ఉండి ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని సైతం టార్గెట్ చేయ‌డంలో బీజేపీ నేత‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ప‌రిపాలించిన స‌మ‌యంలోనే ప‌లు ఘ‌ట‌న‌లు, నిధుల విష‌యాన్ని ఉటంకిస్తూ బీజేపీ ఎదురుదాడి చేస్తుంటుంది. అయితే, వారికి మ‌రింత ఊతం ఇచ్చేలా తాజాగా వైసీపీ స‌మాచారం ఇచ్చింది.

 

ఇదేంటి చంద్ర‌బాబు ?

ఓ మీడియా సంస్థ‌తో చంద్ర‌బాబు మాట్లాడుతూ, తాను అధికారంలోకి వస్తే రైతుల‌కు ఇంత డబ్బు ఇద్దామని అనుకున్నాన‌ని పేర్కొంటూ అది వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఇవ్వడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం దానిని ఎగ్గొట్టినట్లు విశ్లేషించారు. దీనిపై వైసీపీ మంత్రి క‌న్న బాబు స్పందిస్తూ, సీనియారిటీ, వయస్సు పెరిగే కొద్దీ ఆలోచనలు, మాట్లాడే మాటల్లో కొంతైనా నిజాయితీ వుంటుదని, చంద్రబాబులో మాత్రం దురదృష్టవశాత్తు అటువంటి లక్షణాలు కనిపించడం లేదని అన్నారు. రైతుల విషయంలో చంద్రబాబు చెబుతున్న అబద్దాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు.

దీనికి ఏం జ‌వాబిస్తావు బాబు?

కేంద్ర, రాష్ట్ర పథకాలంటూ లేదా కేంద్రం వాటా, రాష్ట్రం వాటా అంటూ చంద్రబాబు చేసిన వాదన మరింత దిగజారుడుగా ఉందని క‌న్న‌బాబు ఎద్దేవా చేశారు. “నిజానికి ఏ పథకం అయినా కేంద్రం వాటా, రాష్ట్రం వాటా, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు.. ఇవన్నీ కలిపితేనే కదా.. బడ్జెట్ నిధులు సమకూరేది. పథకాలకు కూడా అంతే. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలియ‌దా? లేక‌పోతే కావాల‌నే ఇలా మాట్లాడుతున్నారా?“ అంటూ ప్ర‌శ్నించారు.

బీజేపీ నేత‌ల‌కు భలే చాన్స్

చ‌ద్రబాబు తన హయాంలో చంద్రన్న బాట.. అంటూ కేంద్రం నుంచి 90 శాతం నిధులు అందించిన ఉపాధి హామీ పథ‌కాన్ని వాడుకున్నారని క‌న్న‌బాబు ఆరోపించారు. “ చంద్ర‌న్న బాట ప‌థ‌కంలో రాష్ట్రం వాటా కేవలం పదిశాతం. చంద్రన్న బాట రోడ్లలో మీరు వేసింది కేవలం 10 శాతం మాత్రమే అంటే ఒప్పుకుంటావా చంద్ర‌బాబు? అలానే చంద్రన్న బీమా.. అంటూ మరో పథకం పెట్టారు. ఇదికూడా రెండు కేంద్ర పథకాల కలయికగా ఏర్పడింది. అలాగే, గ్రామీణ గృహ నిర్మాణంలో 1.5 లక్షల ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి వస్తే, వాటికి ఎన్టీఆర్ హౌసింగ్ అని పేరు పెట్టుకున్నారు. అలాగే మరో కేంద్ర ప్రభుత్వ పథకానికి తల్లీ బిడ్డ చల్లగా.. అని పేరు పెట్టారు. మరి ఇవన్నీ చంద్రబాబు పథకాలేనా..? జ‌వాబు ఏది చంద్ర‌బాబు?“ అంటూ క‌న్న‌బాబు నిల‌దీశారు.

author avatar
sridhar

Related posts

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N