అన్ని పిటిషన్లు వేరు ..ఈ పిటిషన్ వేరు! జగన్ కి యాంటీ గా హైకోర్టు కెక్కిన మరో న్యూటాపిక్ !!

ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో చిత్ర విచిత్రమైన పిటిషన్లు దాఖలవుతున్నాయి.న్యాయవ్యవస్థ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న ఉద్దేశంతో టిడిపి నేతలు మరీ రెట్టించిన ఉత్సాహంతో రోజుకో పిటిషన్ వేసేస్తున్నారు.

 Another new topic raised by the High Court as anti to Jagan
Another new topic raised by the High Court as anti to Jagan

నిజానికి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అంశం కాకపోయినప్పటికీ ఒక పిటిషన్ వేస్తే ఏం పోతుంది లే అన్న ఉద్దేశంతో టిడిపి నేతలు, జగన్ వ్యతిరేకులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.అలాంటి సిల్లీ పిటిషన్ ఒకటి తాజాగా టిడిపి మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేశారు.రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న గృహాలను లబ్దిదారులకు కేటాయించటంలో జరిగిన జాప్యంపై జుడిషియల్ విచారణ జరిపించాలని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు కోరారు.ఈ ‘పిల్’ లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే, ఏపీ టీడ్కో, ఎఎంఆర్డీయే, కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ శాఖలను చేర్చారు.

ప్రముఖ న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తరపున దీనిని వేశారు.అమరావతి ప్రాంతంలో రూ.324 కోట్లు వ్యయం చేసి, 5,024 గృహాలను నిర్మించారని, అందుకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక సైతం పూర్తయిందని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు.ఈ గృహాలకు కు లబ్ధిదారులు తమ వంతు వాటా కూడా చెల్లించారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా మొత్తం భరించాయని చెప్పారు.ఆయా గృహాల నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చిందని అయినప్పటికీ ఇప్పటివరకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వారికి అప్పగించడం లేదని పిల్ లో పేర్కొన్నారు.

దీనివల్ల లబ్ధిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే కోర్టు జోక్యం చేసుకుని ఆయా గృహాలను వారికి అప్పగించే టట్లు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.అసలు ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందో విచారించాలని కూడా పిటిషన్ దారుడు కోరాడు.అసలే రాజధాని వ్యవహారం కోర్టులో నలుగుతున్న తరుణంలో ఆప్రాంతానికి చెందిన మరొక పిటిషన్ కూడా హైకోర్టు విచారణకు రావటం ఇక్కడ గమనార్హం.